Begin typing your search above and press return to search.

అయ్యయ్యో... ఎంత పనైపోయింది..!

By:  Tupaki Desk   |   26 Jun 2016 4:57 AM GMT
అయ్యయ్యో... ఎంత పనైపోయింది..!
X
యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలన్న చారిత్మాత్రక తీర్పును ఇచ్చిన బ్రిటీషర్లు ఇప్పుడు విపరీతమైన వేదన చెందుతున్నారు. బ్రెగ్జిట్ కు ఓకే చెప్పేసిన అత్యధికులు తాము తీసుకున్న నిర్ణయానికి విపరీతంగా చింతిస్తున్నారు. బ్రెగ్జిట్ కు అనుకూలంగా ఓటు వేసిన వారు ఇప్పుడు మరో మాట మొదలెట్టారు. అప్పుడేదో అలా జరిగిపోయిందని..దాన్ని సరిదిద్దుకోవటానికి వీలుగా ఈ అంశం మీద రెండో రెఫరెండం పెట్టాలన్న డిమాండ్ చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలంటూ తీసుకున్న నిర్ణయం కారణంగా బ్రిటన్ కు కలిగే నష్టాల్ని ఆలస్యంగా గుర్తించిన బ్రిటీషర్లు ఇప్పుడు విపరీతమైన ఆందోళన చెందుతున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తాజాగా రెండోసారి రెఫరెండం కోసం పట్టుబడుతున్న వారంతా రెండో ఎన్నికను పట్టుబడుతూ.. ఒక్కరోజు వ్యవధిలోనే 10 లక్షల మంది సంతకాలు చేశారు. నిజానికి ఇలా సంతకం పెట్టే వారి సంఖ్య మరింత ఎక్కువ ఉండాల్సి ఉన్నా.. విపరీతమైన రద్దీతో వెబ్ సైట్ క్రాష్ కావటంతో మరింత మంది సంతకాలు పెట్టే అవకాశం లేకుండా పోయింది.

ఇక.. రెండోసారి రిఫరెండం నిర్వహించాలంటూ కోరుతున్న వారు లేవనెత్తిన వాదన ఏమిటంటే.. మొత్తం 75 శాతం కంటే తక్కువగా నమోదైన ఓటింగ్ లో ఈయూ నుంచి వైదొలగాలి లేదంటే కొనసాగాలంటూ చెప్పిన వారు 60 శాతం కంటే తక్కువగా ఉన్నారని.. అందుకే రెండో రెఫరెండాన్ని నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వాదనపై బ్రిటిష్ పార్లమెంటులో చర్చకు రానుంది. మరి.. ఈ వాదనపై హౌజ్ ఆఫ్ కామర్స్ లో ఏం చర్చిస్తారో చూడాలి.