Begin typing your search above and press return to search.

గ్యాస్ లీక్ బాధితులను కరోనా సైతం వదల్లేదు

By:  Tupaki Desk   |   7 May 2020 11:30 PM GMT
గ్యాస్ లీక్ బాధితులను కరోనా సైతం వదల్లేదు
X
ప్రపంచంలోనే భోపాల్ గ్యాస్ లీకేజీ అతిపెద్ద మానవ వినాశక తప్పిదం..ఈ దుర్గటనతో 10వేల మంది ఒక్కరోజులో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ఆ గ్యాస్ లీక్ తో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న వారు భోపాల్ లో ఉన్నారు. అంతలా కబళించిన ఈ గ్యాస్ లీకేజీ బాధితులకు ఇప్పుడు కరోనా పెను శాపంగా మారింది.

ప్రధానంగా భోపాల్ గ్యాస్ బాధితులకు కరోనా త్వరగా సోకుతోందని తేలింది. గురువారం 12 మంది గ్యాస్ బాధితులు కరోనాతో మృతి చెందడం విషాదం నింపింది. భోపాల్ గ్యాస్ లీకైన ప్రాంతంలో ఇప్పటికీ ఉంటున్న వారి రోగనిరోధక శక్తి చాలా వీక్ గా ఉందట.. వారికి కరోనా లక్షణాలు తాజాగా కనిపించడంతో వారిని వేరే ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు.

దీనిపై వైద్య అధికారులు స్పందించారు. భోపాల్ గ్యాస్ బాధితులపై కరోనా వైరస్ ప్రభావం చూపుతోందని.. తొందరగా అటాక్ అవుతోందని.. దీని కారణంగానే 12మంది మరణించారని నిర్ధారించారు. గ్యాస్ బాధితుల మరణాలకు కరోనానే కారణమని.. వారిని త్వరగా కబళిస్తోందని తేల్చారు.

కాగా నాటి భోపాల్ గ్యాస్ లీకేజీని తట్టుకొని ఇన్నాళ్లు బతికిన వారు కరోనాతో బలికావడం మృతుల కుటుంబాల్లో తీరని విషాదాన్నినింపింది. నాడు 1984 భోపాల్ యూనియన్ కార్బైడ్ కంపెనీ నుంచి గ్యాస్ లీక్ అయిన వారిలో లక్షల మంది బాధితులు నేటికి చికిత్స పొందుతూనే ఉన్నారు. వారిపై తాజాగా కరోనా ప్రభావం అధికంగా ఉండడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.