Begin typing your search above and press return to search.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈసారి భిన్నమైన ‘బడ్జెట్’

By:  Tupaki Desk   |   24 Jan 2021 4:31 AM GMT
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈసారి భిన్నమైన ‘బడ్జెట్’
X
కోవిడ్ కారణంగా రూల్స్ అన్ని మారిపోయాయి. ఇప్పటివరకు వినని ఎన్నో విషయాల్ని.. విశేషాల్ని చూస్తున్న పరిస్థితి. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన ఈ మహమ్మారి.. చాలానే రూల్స్ ను బ్రేక్ చేయటమే కాదు.. కొత్త పరిణామాలకు తెర తీసిందని చెప్పాలి. దీంతో.. ఇంతకాలం సాగుతున్న సంప్రదాయాలకు వరుస పెట్టి బ్రేకలు వేయాల్సిన పరిస్థితి.

తాజాగా దేశ బడ్జెట్ కసరత్తు తుదిదశకు చేరుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ఫిబ్రవరి ఒకటిన ప్రవేశ పెడుతున్నారు. రోటీన్ కు భిన్నంగా ఈసారి బడ్జెట్ ను అస్సలు ప్రింట్ చేయరు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బడ్జెట్ కాపీల్ని ప్రింట్ చేయకూడదని తొలిసారి నిర్ణయించారు. కోవిడ్ నేపథ్యంలో కాపీల్ని ప్రింట్ చేయటం కంటే మొబైల్ అప్లికేషన్ తయారుచేసి.. అందులోనే బడ్జెట్ సమాచారాన్ని ఉంచబోతున్నారు.

దీంతో తొలిసారి పార్లమెంట్ సభ్యులకు ఈసారి బడ్జెట్ ప్రతుల్ని ఎలక్ట్రానిక్ పద్దతిలో అందించనున్నారు. ఇందుకు సంబంధించిన యాప్ ను తాజాగా విడుదల చేశారు. ఈ యాప్ ద్వారా బడ్జెట్ ప్రతుల్ని యాక్సెస్ చేయటమే కాదు.. అవసరమైతే ప్రింటింగ్ చేసుకోనే వెసులుబాటు కల్పించారు. ప్రింటింగ్.. జూమ్.. సెర్చ్.. బైడైరెక్షనల్ స్క్రోలింగ్ లాంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఫిబ్రవరి ఒకటిన పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని వినిపించిన తర్వాత యాప్ లోకి బడ్జెట్ డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయనున్నారు.