Begin typing your search above and press return to search.
వైఎస్సార్ గొప్పోడు అని సీబీఎన్ ఒప్పుకున్నట్లే...?
By: Tupaki Desk | 9 May 2022 5:31 AM GMTఅవునా ఇది నిజమా అంటే అవును అనే చెప్పాలి. చంద్రబాబు నోట చాలా ఏళ్ల తరువాత వైఎస్సార్ గురించి చక్కని మాట వచ్చింది. అది కూడా జగన్ తో పోలుస్తూ వైఎస్సార్ గురించి బాగానే చెప్పారు. వైఎస్సార్ కంటే జగన్ గొప్పోడా అని సూటిగా ఆయన వైసీపీ వారిని ప్రశ్నించడం అంటే ఇండైరెక్ట్ గా వైఎస్సార్ గొప్పవారు అని ఒప్పుకున్నట్లే అంటున్నారు.
విషయానికి వస్తే తిరుపతి టూర్ లో చంద్రబాబు వైసీపీ నేతల విమర్శల పట్ల వారి మాటల తీరు మీద ఒక్క లెక్కన మండిపడ్డారు. వైసీపీ ఏపీలో విపక్షాల పొత్తుల మీద ఎగిరెగిరి పడుతోంది అని బాబు ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో పొత్తులు సహజమని కూడా ఆయన అంటున్నారు. వైసీపీ ఏపీలో మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక సర్వనాశనమే అని కూడా చంద్రబాబు ప్రజలను హెచ్చరించారు. ఇక ఏపీ కోలుకోలేని విధంగా దెబ్బతింటుందని కూడా బాబు ఆందోళన వ్యక్తం చేశారు.
అలా జరగకుండా ఉండాలంటే అంతా కలసిరావాల్సిందే అని ఆయన పేర్కొంటున్నారు. ఇక టీడీపీ పొత్తుల మీద వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు కూడా బాబు కరెక్ట్ గానే బదులిచ్చారు. అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ లో ఉండి కూడా వామపక్షాలతో టీయారెస్ తో పొత్తు పెట్టుకున్న సంగతి నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. మరి వైఎస్సార్ నాడు ఎందుకు పొత్తులు పెట్టుకున్నారు అని కూడా ఆయన వైసీపీ నేతలకే తిరిగి ప్రశ్నను సంధించారు.
ఇక పొత్తులు వద్దు సింగిల్ గానే తాము పోటీ చేస్తామని చెబుతూ ఎదుటి పార్టీలను తెగ వీక్ అని హేళన చేస్తున్న వైసీపీ నేతల తీరుని కూడా బాబు తప్పుపట్టారు. వైఎస్సార్ కంటే జగన్ గొప్పవాడా అని కూడా ఆయన లాజిక్ పాయింట్ తీశారు.
ఏపీలో వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇది సత్యం, నిజం కూడా అందుకే తాము వైసీపీని ఎలా గద్దె దించాలో ఆలోచిస్తున్నామని, పొత్తుల విషయంలో సరైన టైమ్ లో సరైన నిర్ణయం తీసుకుంటామని కూడా బాబు పక్కాగా క్లారిటీ ఇచ్చారు.
మొత్తానికి చూస్తే బాబు తన పొత్తుల విషయాన్ని సమర్ధించుకోవడానికి మధ్యలో వైఎస్సార్ ని తీసుకువచ్చారు. అంతే కాదు, వైస్సార్ గొప్పవారు అని ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నారు. మరి జగన్ని తిట్టాలీ అంటే వైఎస్సార్ ని మంచి వారు చేయాలి కదా. అదే నిజమా లేక నిజంగా బాబు తన చిరకాల స్నేహితుడు వైఎస్సార్ మీద మనసులో ఉన్నది చెప్పారా. ఏమైనా బాబు రాజకీయ చాణక్యుడు ఆయన మాటలకు అర్ధాలు పరమార్ధాలు వేరేగానే ఉంటాయి. ఇది నిజం. ఇక వైఎస్సార్ కంటే జగన్ గొప్పవారు అని వైసీపీ నేతలే కాదు, ఆఖరుకు జగన్ కూడా ఒప్పుకోలేరు. కాబట్టి అలా వారి నోటికి బాబు భలేగా తాళం వేశారు అనుకోవాలేమో.