Begin typing your search above and press return to search.
లాఠీలు చీపుర్లు పట్టాయి
By: Tupaki Desk | 12 July 2015 3:45 AM GMTలాఠీలు పట్టుకుకొని.. హడావుడి చేతులు చీపుర్లు పట్టాయి. మనసులో మాటను కాసేపు పక్కన పెడితే.. ఉన్నతాధికారులు ఏం చెబితే ఆ పని చేసే అలవాటున్న పోలీసులు.. తాజాగా రోడ్లును శుభ్రం చేసే బృహత్తర బాధ్యతను నెత్తిన వేసుకున్నారు.
గత ఆరు రోజులుగా పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో.. భాగ్యనగరి కాస్తా.. చెత్తనగరిగా మారిపోయి.. వీధులన్నీ కంపు కొడుతున్న పరిస్థితి.
ప్రభుత్వం.. కార్మికుల మధ్య చర్చలు ఒక పట్టాన తేలకపోవటం.. మరోవైపు రోడ్ల మీద చెత్త కొండలా పేరుకుపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న పరిస్థితి. దీంతో.. రక్షణ బాధ్యతలు చేపట్టే పోలీసులే చీపుర్లు చేతబట్టారు. రోడ్ల మీద పేరుకుపోయిన చెత్త సంగతి తేల్చే పనిలో పడ్డారు.
రోడ్ల మీద పేరుకున్న చెత్తను తొలగించమని తమకు ఎవరూ చెప్పలేదని.. స్వచ్ఛ హైదరాబాద్ స్ఫూర్తితోనే తామీ పని చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నా.. లోగుట్టు వేరేగా ఉందన్న మాట వినిపిస్తోంది. లాఠీలు చెత్తతొలగింపు మొదలు పెట్టటంతో పలు ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికులు అడ్డుకునే ప్రయత్నం చేయటంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి.
చీపుర్లతో వీధులు ఊడ్చే పని మొదలు పెట్టిన పోలీసులు ప్రస్తుతం.. చార్మినార్ ప్రాంతంలో చెత్త తొలగింపు మొదలు పెట్టారు. వారి స్ఫూర్తితో మిగిలిన ప్రాంతాల్లోని పోలీసులు సైతం చీపుర్లు పట్టే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. పోలీసులు చెత్త తొలగింపులో బిజీగా ఉంటే.. శాంతిభద్రతల వ్యవహారం సంగతి గురించి పోలీసు బాస్ లు జర ఆలోచిస్తే బాగుంటుందేమో.