Begin typing your search above and press return to search.
సభ జరగలేదు..మాకు జీతాలు ఏం అక్కర్లేదు
By: Tupaki Desk | 5 April 2018 10:48 AM GMTపార్లమెంటు మలి విడత బడ్జెట్ సమావేశాలు ఏ ఒక్క రోజు కూడా ఫలవంతంగా జరగని సంగతి తెలిసిందే. ఆయా పార్టీలు తమ ఎజెండాల మేరకు - ప్రజల ఆకాంక్ష మేరకు గళం విప్పుతుండటంతో ఇటు పెద్దల సభ అయిన రాజ్యసభ అటు లోక్ సభ కూడా ప్రారంభమైన స్వల్ప వ్యవధిలోనే వాయిదా పడటం...అలా రెండు మూడు వాయిదాల అనంతరం మరుసటి రోజుకు వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష వైసీపీ సహా అధికార టీడీపీ - జాతీయ పార్టీలైన కాంగ్రెస్ - వామపక్షాలు అవిశ్వాసం తీర్మానం ఇచ్చాయి. మరోవైపు కావేరీ బోర్డు కోసం అన్నాడీఎంకే నిరసన తెలుపగా...రిజర్వేషన్ల కోటా పెంచాలని టీఆర్ ఎస్ నిరసన తెలుపుతుండటంతో పార్లమెంటు సమావేశాలు సాగలేదు. ఈ నేపత్యంలో ప్రస్తుతం జరుగుతున్న రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంట్ లో బీజేపీ - దాని మిత్రపక్షాలకు చెందిన ఎంపీలు 23 రోజుల వేతనాన్ని తీసుకోకూడదని నిర్ణయించుకున్నాయి.
తమ రాష్ట్ర సమస్యలు పరిష్కరించాలని - డిమాండ్లు నెరవేర్చాలని గత కొద్దిరోజులుగా పార్లమెంట్ ఉభయసభల్లో వివిధ పార్టీల నేతల వెల్ లోకి దూసుకెళ్లి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ - టీడీపీ - అన్నాడీఎంకేలతో పాటు పలు పార్టీలు నిరసన వ్యక్తం చేయడంతో ఉభయసభలు సజావుగా జరగకుండానే ప్రతిరోజూ వాయిదా పడుతున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ మినహా ముఖ్యమైన బిల్లులేవీ ఆమోదం పొందని విషయం తెలిసిందే. ట్రిపుల్ తలాక్ - సిటిజెన్ షిప్ అమెండ్ మెంట్ బిల్-2016 - నేషనల్ మెడికల్ కమిషన్ బిల్-2017 పార్లమెంట్ లో పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ మిత్రపక్షాలు జీతం వదులుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఎంపీలు తమ జీతాలను వదులుకోవడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి.
కాగా, తాజా పరిణామంపై పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి అనంతకుమార్ తాజాగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నిరంతరాయంగా సభలో గందరగోళం సృష్టిస్తోందని తీవ్రంగా అనంత్ కుమార్ విమర్శించారు. ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందకుండా కాంగ్రెస్ ప్రజాస్వామ్య వ్యతిరేక రాజకీయాలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిపై ఆ పార్టీకి ఇష్టం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.