Begin typing your search above and press return to search.
అతిపెద్ద కుంభకోణం అసలు కథ
By: Tupaki Desk | 2 Oct 2015 3:15 PM GMTదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి...అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పాత్రను ప్రశ్నించేలా వెలుగులోకి వచ్చిన బొగ్గు కుంభకోణంలో కీలక పరిణామం తాజాగా వెలుగులోకి వచ్చింది. యూపీఏ 2 సర్కారులో బొగ్గు శాఖ వ్యవహారాలు పర్యవేక్షించిన అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ వివరాలు వెల్లడించారు. తాజాగా సీబీఐకి ఆయన వివరణ ఇస్తూ అసలేం జరిగిందో స్పష్టం చేశారు. బొగ్గు గనుల కేటాయింపు విషయంలో తానెవరినీ ప్రభావితం చేయలేదనీ ఆయన తెలిపారు.
ఒడిషాలోని తాలబిరా బొగ్గు బ్లాకును హిందాల్కో కంపెనీకి కేటాయించడానికి తొలుత తిరస్కరించినప్పటికీ తరువాత ఆ కంపెనీకే కేటాయింపు జరిగింది. అయితే దీనివెనక అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై మన్మోహన్ వివరణ ఇస్తూ....బొగ్గు బ్లాక్ లను హిందాల్కోకు కేటాయించాలంటూ తానెవరిపైనా ఒత్తిడి తీసుకురాలేదని స్పష్టం చేశారు. ఆ గనుల కేటాయింపులో ఎటువంటి తొందరపాటు, పక్షపాతం లేదనీ ఆయన ఈ రోజు సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్ లో స్పష్టం చేశారు. ఒడిశాలోని ఈ బొగ్గు బ్లాకు కేటాయింపునకు సంబంధించి పారిశ్రామిక వేత్త కుమార మంగళం బిర్లాకు ఎటువంటి ప్రయత్నం చేయలేదనీ, ఎటువంటి హామీలూ ఇవ్వలేదని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. అప్పట్లో బొగ్గు శాఖను కూడా నిర్వహిస్తున్నందున ఈ విషయంలో జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవలసిందిగా కోరుతూ మంత్రిత్వ శాఖకు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు స్పష్టం చేశానని మన్మోహన్ సింగ్ తెలిపారు.
ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పార్టీ పెద్దల అడుగులకు తగ్గట్లు నిర్ణయాలు తీసుకున్న మన్మోహన్ సింగ్ ఇపుడు తాజాగా విచారణ సంస్థల గుమ్మం ఎక్కే స్థాయికి చేరారు. నాయకుల చేతిలో కీలుబొమ్మల్లా మారితే పాలకులు ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సివస్తుందో మన్మోహన్ సింగ్ పరిస్థితే నిదర్శనం.