Begin typing your search above and press return to search.

గ్రీన్ కార్డు ఉంటే నో నిషేధం

By:  Tupaki Desk   |   30 Jan 2017 5:09 PM GMT
గ్రీన్ కార్డు ఉంటే నో నిషేధం
X
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ అధికారాన్ని చేపడితే పరిస్థితులు గందరగోళంగా మారతాయన్న వాదనకు తగ్గట్లే పరిణామాలో చోటు చేసుకుంటున్నాయి. అధ్యక్ష కుర్చీలో కూర్చొని నిండా పది రోజులు కాక ముందే..ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో పరిస్థితి రచ్చ రచ్చగా మారింది. ముస్లింలు మెజార్టీగా ఉన్న ఏడు దేశాల ప్రజలు అమెరికాకు వచ్చే విషయంలో పరిమితులు విధించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేయటంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో సదరు ఆరు దేశాలకు చెందిన గ్రీన్ కార్డులున్న వారిపై నిషేధం వర్తించదంటూ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. వివాదాస్పద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై అమెరికా వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. శరణార్ధులకు అనుకూలంగా అమెరికా మొత్తం మద్దతు పలకటం గమనార్హం. తాజా పరిణామాల నేపథ్యంలో నిషేధం విధించిన ఏడు దేశాలకుచెందిన గ్రీన్ కార్డు హోల్డర్స్ విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని తేల్చి చెప్పింది. అయితే.. సందేహాస్పదంగా వ్యవహరిస్తే మాత్రం వారిని ప్రశ్నించటం జరుగుతుందని చెబుతున్నారు. ట్రంప్ నిర్ణయం నేపథ్యంలో శనివారం వందలాది మంది గ్రీన్ కార్డు హోల్డర్స్ ను ఎయిర్ పోర్ట్ నుంచి అధికారులు బయటకు వెళ్లనీయకుండా చేయటంపై పలువురు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ సర్కారు.. తను విధించిన నిషేధాన్ని గ్రీన్ కార్డు హోల్డర్స్ కు మినహాయించేలా నిర్ణయం తీసుకోవటం గమనార్హం.