Begin typing your search above and press return to search.

ఇవాల్టి లిస్ట్ లో ఆ కేసు షెడ్యూల్ కాలేదు

By:  Tupaki Desk   |   10 Feb 2017 7:09 AM GMT
ఇవాల్టి లిస్ట్ లో ఆ కేసు షెడ్యూల్ కాలేదు
X
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడెంత హైటెన్షన్ తో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నమ్మ వర్సెస్ పన్నీర్ గా మారిన అన్నాడీఎంకే అంతర్గత పోరులో శశికళకు తరచూ ఎదురుదెబ్బలు తగులుతున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వేళ.. ఆమె కాస్త ఊరట చెందే పరిణామం ఒకటి చోటు చేసుకుంది. అప్పుడెప్పుడో సంవత్సరాల క్రితం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అమ్మతో పాటు.. జైలుకు వెళ్లిన కేసులో తీర్పు వారంలో వెలువడనున్నట్లు సుప్రీం చెప్పటం తెలిసిందే.

ముఖ్యమంత్రిగా పగ్గాలు అందుకునే వేళలో సుప్రీంకోర్టు చెప్పిన మాటతో.. ఆమెకున్న అవకాశాలు ఒక్కసారిగా మూసుకుపోయినట్లుగా వాదనలు వినిపించాయి. ఈ వాదనను నిజం చేసేలా అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎంపికైన చిన్నమ్మ చేత ప్రమాణస్వీకారాన్ని చేయించేందుకు గవర్నర్ తటపటాయించటంతో ఈ కేసు చిన్నమ్మకు పెద్ద తలనొప్పిగా మారింది.

ఈ రోజు సుప్రీం విచారించే కేసుల లిస్ట్ లో చిన్నమ్మ కేసు కూడా ఉంటుందని భావించారు. అయితే..అలాంటిదేమీ చోటు చేసుకోలేదు. ఈ రోజు సుప్రీంలో విచారించే కేసుల లిస్ట్ లో చిన్నమ్మ కేసు లేకపోవటం కాస్తంత రిలీఫ్ అంశంగా చెప్పాలి. మరి.. వచ్చే వారంలో అయినా ఈ కేసు విచారణకు లిస్ట్ అవుతుందా? అన్నది ఒక ప్రశ్నఅయితే.. మరి.. తీర్పు కోసం వెయిట్ చేస్తున్నట్లుగా చెబుతున్న గవర్నర్.. తాజా పరిణామాల నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. సుప్రీం తీర్పులో చిన్నమ్మ దోషిగా తేలితే.. పరిణామాలు మరోలా ఉండే అవకాశం ఉంది. కానీ.. ఎటూ తేలని ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ కేసును 1996లో ఇప్పటి బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి అమ్మపైనా.. చిన్నమ్మపైనా వేశారు. ఇదిలా ఉంటే.. అక్రమాస్తుల కేసులో చిన్నమ్మపై కేసు వేసిన స్వామి.. ఇప్పుడు మాత్రం ఆమెను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించాల్సిన అవసరం ఉందన్న వాదనను వినిపిస్తుండటం విశేషంగా చెప్పాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/