Begin typing your search above and press return to search.

అధికార పార్టీకి సెగ‌.. మ‌రో పార్టీ రెడీ...!

By:  Tupaki Desk   |   1 Dec 2021 10:30 AM GMT
అధికార పార్టీకి సెగ‌.. మ‌రో పార్టీ రెడీ...!
X
ఆనంద‌య్య‌.. గుర్తున్నారా? గ‌త ఏడాది క‌రోనా రెండో ద‌శ స‌మ‌యంలో ఆయుర్వేదంతో రోగుల‌కువైద్యం చేస్తాన‌ని.. వారిని చావునుంచి బ‌య‌ట‌కు తీసుకువ‌స్తాన‌ని.. చెప్పిన నెల్లూరు ఆనంద‌య్య‌.. అంద‌రికీ అప్ప‌ట్లో దేవుడిని మించిపోయారు. క‌రోనా స‌మ‌యంలో లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా..

అంద‌రూ కూడా ఆనంద‌య్య మందుకోసం.. నెల్లూరుకు క్యూ క‌ట్టారు.ఇక‌, ఆ స‌మ‌యంలో ప్ర‌భుత్వం జోక్యం చేసుకోవ‌డం.. ఈ మందుపై అనుమానాలు రేకెత్తించ‌డం వంటివి తెలిసిందే. అయితే.. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆనంద‌య్య .. క‌రోనా గురించిన ప్ర‌స్తావ‌న ఎప్పుడు తెర‌మీదికి వ‌చ్చినా.. ఆయ‌న పేరు వినిపిస్తూనే ఉంది.

అయితే.. ఇప్పుడు ఆయ‌న సంచ‌ల‌న కామెంట్లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పార్టీ పెడుతున్నాన‌ని.. ఆనంద‌య్య పేర్కొన్నారు. ప్ర‌స్తుతం బీసీ జేఏసీ గౌర‌వ స‌ల‌హాదారుగా ఉన్న ఆనంద‌య్య‌.. గ‌త ఏడాది నుంచి కూడా పార్టీ ఏర్పాటుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే.. దీనిపై అంద‌రూ లైట్ తీసుకున్నారు. అయితే.. తాజాగా.. ఆయ‌న‌తో రాష్ట్రంలోని ఒక కీల‌క పార్టీ నుంచి చ‌ర్చ‌ల‌కు ర‌మ్మ‌ని.. ఆహ్వానం వ‌చ్చింద‌ని.. పెద్ద ఎత్తున బీసీ సామాజిక వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీ పెడుతున్న‌ట్టు ఆనంద‌య్య ప్ర‌క‌టించ‌గానే.. ఈ విష‌యంపై రాష్ట్రంలో చ‌ర్చ జ‌రిగింది.

అయితే.. ఆయ‌న పార్టీ పెట్టినా.. ఎవ‌రికి మాత్రం ఏం ఒరుగు తుందిలే అనుకున్నారు. కానీ, ఇప్పుడు ప‌రి ణామాలు మారుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టిప‌రిస్థితిలోనూ విజ‌యం ద‌క్కించుకునేందుకు ప్ర‌యత్ని స్తున్న ఒక పార్టీ.. ఇప్పుడు ఆనంద‌య్య‌ను త‌మ‌వైపు తిప్పుకొని.. లోపాయికారీగా.. ప‌నిచేయించుకునేందు కు రెడీ అవుతున్న‌ట్టురాజ‌కీయ వ‌ర్గాల్లో గుస‌గుస వినిపిస్తోంది.

అంటే.. బీసీ సామాజిక వ‌ర్గం ఓట్లు చీలినా.. త‌మ‌కు న‌ష్టం జ‌ర‌గ‌కుండా.. అదేస‌మ‌యంలో అధికార‌ పార్టీకి లాభించ‌కుండా ఉండేలా.. స‌ద‌రు ప్ర‌ధాన పార్టీ చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ నేప‌థ్యంలో ఆనంద‌య్య మ‌రోసారి త‌న వ్యూహాన్ని బ‌య‌ట పెట్టార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏదేమైనా.. అధికార పార్టీకి సెగ పెట్టేందుకు.. మ‌రో పార్టీ రెడీ అవుతోంద‌నే వ్యాఖ్య‌లు మాత్రం రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతుండ‌డం గ‌మ‌నార్హం.