Begin typing your search above and press return to search.
పెళ్లంటే నూరేళ్ల మంట కాదు.. పంటే.!
By: Tupaki Desk | 11 April 2021 3:31 AM GMT‘పెళ్లంటే నూరేళ్ల మంట ’ అంటారు భార్యలు.. ఇన్నాళ్లు హాయిగా బ్యాచ్ లర్ గా ఎంజాయ్ చేసిన పురుషులకు పెళ్లి కాగానే వారి ముందరి కాళ్లకు ‘భార్య’ అనే బంధం వేస్తుంది. సాయంత్రాలు పార్టీలు, పబ్బులకు చెక్ చెప్పి ఇంటికొచ్చేలా చేస్తుంది. బుద్దిగా పిల్లా పాపాలతోనే సంసారం చేయాలని నిబంధనలు పెడుతుంది. అయితే అది భారంగా చూసే పురుషులు ఎంతో మంది ఉన్నారు. కానీ అది భారం కాదు బాధ్యత అనేవారున్నారు.
కొందరైతే తమ స్వేచ్చాయుత జీవితానికి ఫుల్ స్టాప్ పడుతుందని పెళ్లికి నిరాకరించి ఎంజాయ్ చేసే వారు ఉంటారు. కానీ పెళ్లి చేసుకోకపోతే వచ్చే అనర్థాలు ఎక్కువ అట.. పెళ్లి చేసుకుంటే ఆయుష్షు పెరుగుతుందని ఓ బ్రిటన్ అధ్యయనం తేల్చింది.
ఒంటరిగా ఉండేవారితో పోల్చితే వివాహితులు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని బ్రిటన్ అధ్యయనంలో వెల్లడైంది. ఆరోగ్య జీవనానికి వివాహం ఒక చక్కని మార్గమని పరిశోధకులు చెబుతున్నారు.
అనారోగ్యం నుంచి వివాహితులే తొందరగా కోలుకుంటున్నారట.. ముఖ్యంగా గుండెపోటు, బీపీ సమస్యలు పెళ్లైన వారికే తక్కువగా వస్తాయని అధ్యయనంలో తేలింది. అందుకే పెళ్లికాని ప్రసాదులు, మిస్సమ్మలూ తొందరగా పెళ్లి చేసుకోండి. ఆల్ ది బెస్టూ..