Begin typing your search above and press return to search.

కంగనా కామెంట్స్ పై అసదుద్దీన్‌ విమర్శలు ..!

By:  Tupaki Desk   |   16 Nov 2021 4:41 AM GMT
కంగనా కామెంట్స్ పై అసదుద్దీన్‌ విమర్శలు ..!
X
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి వివదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది 1947లో కాదని , అది భిక్ష మాత్రమే అన్నారు. 2014లోనే మోదీ మొదటిసారి ప్రధాన మంత్రిగా గెలిచిన ఏడాది దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని అన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనితో ఈ వ్యాఖ్యలపై రాజకీయంగా దుమారం చేలరేగుతుంది. తాజాగా నటి కంగనా వ్యాఖ్యలపై సదుద్దీన్‌ ఓవైసీ సైటైర్లు విసిరారు. స్వాతంత్య్రం పై కంగనా చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.

కంగనా 2014లోనే నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని, 1947లో వచ్చింది కేవలం భిక్ష అని కామెంట్స్‌ చేయడం తో దేశవ్యాప్తంగా కంగనా పై విమర్శల పాలైంది. తను తీసుకున్న పద్మశ్రీ అవార్డును సైతం వెనక్కి ఇచ్చి వేయాలని చాలా మంది డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని సోషల్‌ మీడియాలో పెద్ద ట్రోల్‌ జరుగుతుంది. కంగనా ఇప్పటికే పలుమార్లు విద్వేశాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. ఈ అంశంపై MIM అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ బీజేపీ నేతలపై ఫైర్‌ అయ్యారు. దేశ అత్యున్నత పురస్కారం అందుకున్న ఓ మేడమ్‌ 2014లో స్వాతంత్య్రం లభించిందన్నారు.

అదే వ్యాఖ్యలు ఓ ముస్లిం చేసి ఉంటే UAPA చట్టం కేసుపెట్టి, మోకాళ్లపై కాల్పులు జరిపి, ఆ తర్వాత జైలుకు పంపేవారని విమర్శించారు. ఆమె రాణి.. మీరు రాజు అయితే మీరు ఏం చేయరంటూ తీవ్ర వ్యాఖ్య లు చేశారు. ఇటీవల జరిగిన భారత్‌ – పాక్‌ టీ20 మ్యాచ్‌ అనంతరం పాక్‌ గెలుపొందడంతో సంబరాలు చేసుకున్న వారిపై దేశద్రోహం కింద కేసులు పెడుతామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ సంద ర్భంగా కంగన రనౌత్‌పై దేశద్రోహం అభియోగాలు మోపుతారా ,విద్రో హం కేసులు కేవలం ముస్లింలపై మాత్రమేనా, అంటూ ప్రశ్నించారు. ఇంతకీ దేశానికి స్వాతంత్య్రం ఎప్పుడు వచ్చిందో చెప్పాలని ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగిని ప్రశ్నించారు.