Begin typing your search above and press return to search.

పాకిస్తాన్‌కు అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చిన ఓవైసీ!

By:  Tupaki Desk   |   9 Feb 2022 4:52 PM GMT
పాకిస్తాన్‌కు అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చిన ఓవైసీ!
X
పాత‌బ‌స్తీ కేంద్రంగా రాజ‌కీయాలు చేస్తున్న ఏఐఎంఐఎం పార్టీ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ ముస్లిం మ‌త‌స్తుల విష‌యంలో వారికి ఇబ్బంది క‌లిగించే ఏ అంశంపై అయినా నిర్మొహ‌మాటంగా స్పందించే విష‌యం తెలిసిందే. హిజ‌బ్ వ్య‌వ‌హారం క‌ర్నాట‌క‌లో క‌ల‌క‌లం రేకెత్తిస్తుండ‌గా దీనిపై దేశంలోనే ఆయా పార్టీల నేత‌లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. త‌మ అభిప్రాయాలు వెల్ల‌డిస్తున్నారు. అయితే, పాక్ విదేశాంగ మంత్రి మ‌హ్మ‌ద్ ఖురేషీ ట్విట్ట‌ర్ వేదిక‌గా రియాక్ట‌య్యారు. అయితే, ఈ కామెంట్ల‌కు ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఘాటు కౌంట‌ర్ ఇచ్చారు.

పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి మ‌హ్మ‌ద్ ఖురేషీ హిజాబ్ వివాదంపై స్పందిస్తూ హిజ‌బ్ ధ‌రించిన కార‌ణంగా మ‌హిళ‌ల‌ను విద్య నుంచి దూరం చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని, ఇది మాన‌వ‌హ‌క్కుల‌ను హ‌రించ‌డ‌మే అవుతుంద‌ని ఆరోపించారు. 'ముస్లిం పిల్ల‌ల‌ను చ‌దువుకు దూరం చేయ‌డం అంటే.. మావ‌న హ‌క్కుల‌ను హ‌రించ‌డ‌మే. ఓ వ్య‌క్తి ప్రాథ‌మిక హక్కుల‌ను హ‌రించ‌డం స‌రైన విధానం కాదు. హిజ‌బ్ ధ‌రించిన వారిని భ‌య‌భ్రాంతుల‌కు గురి చేయ‌డం అంటే అణ‌చివేయ‌డ‌మే. ఇలా చేయ‌డం ద్వారా ముస్లింల‌ను గుప్పిట్లో పెట్టుకోవాల‌ని భార‌త ప్ర‌భుత్వం చూస్తోంది' అంటూ పాక్ విదేశాంగ మంత్రి మ‌హ్మ‌ద్ ఖురేషీ మ‌న‌దేశంలోని ప‌రిణామాల‌పై రియాక్ట‌య్యారు. దీనిపై అస‌దుద్దీన్ స్పందించారు.

భార‌త్ లో బాలిక‌ల విద్య గురించి పాకిస్తాన్ పాఠాలు నేర్పాల్సిన అవ‌స‌రం లేద‌ని అసుదుద్దీన్‌ వ్యాఖ్యానించారు. 'మీ ప‌ని మీరు చూసుకోండి. భార‌త్ విష‌యాల్లో త‌ల‌దూర్చ‌కండి' అంటూ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. `మ‌లాలాను కాపాడ‌లేని దేశం… బాలిక విద్య‌పై భార‌త్‌కు హిత‌వ‌చ‌నాలు చేయ‌డ‌మేంటి` అని తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. బాలికల విద్య‌పై భార‌త్‌కు పాకిస్తాన్ పాఠాలు నేర్పాల్సిన అవ‌స‌రం లేదు. అక్క‌డే మ‌లాల వుంది. పాక్‌లోని బాలిక‌ల‌కు స‌రైన ర‌క్ష‌ణ‌ను క‌ల్పించ‌డంలో విఫ‌ల‌మైన పాక్‌.. ఇప్పుడు భార‌త్‌కు పాఠాలు నేర్పుతోంది.`` అంటూ సెటైర్లు వేశారు.