Begin typing your search above and press return to search.
ట్రిపుల్ తలాక్ బిల్లు వేళ.. శబరిమలను తెచ్చిన అసద్!
By: Tupaki Desk | 21 Jun 2019 11:12 AM GMTసంబంధం లేని అంశాల్ని ముడి వేయటంలో హైదరాబాద్ ఎంపీ కమ్ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి మించినోడు లేడన్న విషయం తెలిసిందే. ఈ రోజు ట్రిపుల్ తలాక్ బిల్లుపై లోక్ సభలో హాట్ హాట్ గా మారింది. గత ఏడాది డిసెంబరులో ట్రిపుల్ తలాక్ బిల్లు సరైన బలం లేక రాజ్యసభలో వీగిపోయిన నేపథ్యంలో మరోసారి మోడీ సర్కారు లోక్ సభలో ప్రవేశ పెట్టింది.
ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రవేశ పెట్టటంపై మజ్లిస్ అధినేత అసద్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదిలా ఉంటే.. ట్రిపుల్ తలాక్ చెప్పి తక్షణమే విడాకులు ఇవ్వటాన్ని భారత శిక్షాస్మృతి కింద నేరంగా పరిగణిస్తూ చట్టం తయారు చేయటానికి వీలుగా బిల్లును కేంద్ర న్యాయశాఖామంత్రి ఈ రోజు సభలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లునుప్రవేశ పెట్టిన వెంటనే విపక్షాలు నిరసన తెలిపాయి. తలాక్ విధానానికి తాము వ్యతిరేకమేనని.. అయితే దీన్ని నేరంగా పరిగణిస్తూ జైలుశిక్షను విధించటానికి తాము వ్యతిరేకిస్తున్నట్లుగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేర్కొన్నారు. న్యాయమంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రసంగానికి అడ్డు తగిలిన శశిథరూర్ కు మజ్లిస్ అధినేత అసద్ తోడు కావటంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.
అరుపులు.. కేకల మధ్యే కేంద్రమంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇదిలా ఉండగా శశిథరూర్ ఒక కీలక వ్యాఖ్య చేశారు. కేవలం ముస్లిం భర్తలే భార్యల్ని విడిచి పెట్టటం లేదని.. ఇతర మతాల భర్తలు కూడా వదిలేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. భార్యల్ని వదిలేయటం అన్ని మతాల్లోనూ ఉన్నందున మహిళలు అందరికి భద్రత కల్పించేలా చట్టాన్ని రూపొందించాలని కోరారు. ఇదిలా ఉండగా.. ఈ అంశంపై మజ్లిస్ అధినేత అసద్ మాట్లాడుతూ.. ట్రిపుల్ తలాక్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు.
ముస్లిం పురుషులను మాత్రమే శిక్షించేలా ఈ చట్టాన్ని తీసుకొచ్చారని ఆరోపించిన ఆయన.. ట్రిపుల్ తలాక్ చెప్పటం ద్వారా విడాకులు తక్షణమే ఇవ్వటం కుదరదని ఇప్పటికే సుప్రీం ప్రకటించిన విషయాన్ని ఓవైసీ గుర్తు చేశారు. ముస్లింలకు సాయం చేస్తానని చెప్పే ప్రభుత్వం.. శబరిమల విషయంలో హిందువు మహిళల పట్ల ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
ఓవైసీ నోట శబరిమల అంశం వచ్చినంతనే పలువురు ఎంపీలు తప్పు పట్టారు. దీంతో సభ గందరగోళం రేగింది. అయినా..ట్రిపుల్ తలాక్ కు శబరిమల అంశానికి లింకు ఏమిటి? ఆ మాటకు వస్తే మహిళల్ని మసీదుల్లోకి పురుషులతో పాటుగా రానివ్వరుకదా? శబరిమల గురించి మాట్లాడే అసద్.. మసీదుల్లోకి దేవాలయాల్లోకి మహిళలు వచ్చేలా వచ్చేందుకు ఒప్పుకుంటారా? ఆ మాటకు వస్తే.. శబరిమల ఆలయంలోని మహిళలపై పరిమితుల విషయంలో.. ఇప్పుడున్న విధానాల్ని అనుసరించాలని.. కొత్త పద్దతులు అక్కర్లేదంటూ మహిళలే కిలోమీటర్ల కొద్దీ నిరసన చేపట్టిన విషయాలు అసద్ లాంటోళ్లు ఎందుకు ప్రస్తావించరు?