Begin typing your search above and press return to search.
ఓవైసీ మాట!..మోదీవి పకోడి పాలిటిక్స్!
By: Tupaki Desk | 25 Jan 2018 10:33 AM GMTమజ్లిస్ అధినేత - హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ... ఇటీవలి కాలంలో చాలా ఆసక్తికర కామెంట్లు సంధిస్తున్నారు. గతంలో చాలా హుందాగా వ్యవహరించిన ఓవైసీ... ఇటీవలి కాలంలో చాలా వివాదాస్పద వ్యాఖ్యలతో పాటుగా... ఏకంగా సరికొత్త వివాదాలు రేకెత్తేలాగా మాట్లాడుతున్నారన్న వాదన వినిపిస్తోంది. పాతబస్తీ కింగ్ మేకర్లుగా ఉన్న ఓవైసీ ఫ్యామిలీ... ఇటీవలి కాలంలో తమ పార్టీని ఒక్క పాతబస్తీకే పరిమితం చేయకుండా దేశంలో ఎక్కడ ఏ చిన్న అవకాశం చిక్కినా కూడా వదలకుండా పార్టీని నలు దిశలా వ్యాపించేందుకు తీవ్రంగానే యత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల వారికి ఓ మోస్తరు మద్దతు దక్కుతున్నా... చాలా చోట్ల మాత్రం వ్యతిరేకతే ఎదురవుతోందన్న విషయం ఏ ఒక్కరు కూడా కాదనలేనిదే. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన మజ్లిస్ పార్టీ ఓ రెండు సీట్లను గెలుచుకున్నా... అక్కడ మరింతగా బలపడేందుకు చేస్తున్న యత్నాలు మాత్రం ఎప్పటికప్పుడు బెడిసికొడుతూనే ఉన్నాయని చెప్పక తప్పదు. ఇందుకు నిదర్శనంగా నిన్నటికి నిన్న ముంబై వెళ్లిన అసద్‌పై ఓ చెప్పు పడిపోయిన వైనమేనని చెప్పాలి.
ఏ అంశంపై అయినా విస్పష్టతతో ముందుకు వచ్చే అసద్... ఈ తరహా దాడుల నేపథ్యంలో సహనం కోల్పోతున్నారన్న వాదన లేకోపోలేదు. అయినా అసద్ గురించి ఇంతగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందన్న విషయానికి వస్తే... బాలీవుడ్ లేటెస్ట్ మూవీ పద్మావత్ రిలీజ్ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రగిలిన అల్లర్లపై అసద్ తనదైన శైలి కామెంట్లు విసిరిన నేపథ్యంలో ఆయన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిందేనని చెప్పక తప్పదు. అయినా పద్మావత్ చిత్రానికి, అసద్‌కు ఏం సంబంధం అన్న విషయాన్ని పక్కనబెడితే... పద్మావత్ చిత్రానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు కేంద్రంలోని బీజేపీ సర్కారు సంపూర్ణ మద్దతు పలికిందని అసద్ ఆరోపిస్తున్నారు. కాసేపటి క్రితం మీడియాలో మాట్లాడిన సందర్భంగా అసద్... ఈ దిశగా సంచలన కామెంట్లే చేశారు. ఈ చిత్రంపై జరుగుతున్న నిరసనలన్నీ బీజేపీ ప్రోద్బలంతోనే జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
ప్రదాని హోదాలో ఉన్న నరేంద్ర మోదీ 'పకోడీ' పాలిటిక్స్ చేస్తున్నారని మరింత ఘాటు వ్యాఖ్యలు చేసిన అసద్... బీజేపీ నేతలను మోదీతో కలిపేసి తనదైన శైలి విమర్శలను గుప్పించారు. పద్మావత్ చిత్రంపై నిరసనలు తెలుపుతున్న వారందరికీ, ప్రధాని- ఆయన పార్టీ సరెండర్ అయిపోయిందని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఆరోపించారు. ఈ సందర్భంగా మోదీ ఛాతీని కూడా ప్రస్తావించిన అసదుద్దీన్... మోదీకి ఉన్న 56 అంగుళాల ఛాతీ ముస్లింలను అణచి వేసేందుకే ఉపకరిస్తుందని అన్నారు. దేశంలో చెలరేగుతున్న అల్లర్లను అణచివేసేందుకు ఆ ఛాతీని వినియోగించాల్సిన మోదీ... దానిని మరిచి ఒక్క ముస్లింలను అణచివేసేందుకు మాత్రమే దానిని ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. మరి ఈ విమర్శలపై బీజేపీ అండ్ కో ఎలా స్పందిస్తుందో చూడాలి.