Begin typing your search above and press return to search.

అస‌ద్ ఆగ్ర‌హం.. ఇప్ప‌డు భార‌త‌ర‌త్న‌పై

By:  Tupaki Desk   |   28 Jan 2019 6:24 AM GMT
అస‌ద్ ఆగ్ర‌హం.. ఇప్ప‌డు భార‌త‌ర‌త్న‌పై
X
క‌ల‌కలం రేపే కామెంట్లు చేయ‌డంలో ముందుండే హైద‌రాబాద్ పాత‌బ‌స్తీ నేత, ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ తాజాగా మ‌ళ్లీ అదే త‌ర‌హాలో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. దేశంలోనే అత్యున్నత పురస్కారమైన భారతరత్న గురించి ఆయ‌న స్పందించారు. తాజాగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికా, సామాజికవేత్త నానాజీ దేశ్‌ముఖ్‌ల‌కు కేంద్ర ప్రభుత్వం భార‌త‌రత్న ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దీనిపై వివిధ వ‌ర్గాలు వివిధ అభిప్రాయాలు వ్య‌క్తం చేయ‌గా ఇందులో కులం, మ‌తం కోణాన్ని ఓవైసీ ప్ర‌స్తావించారు.

మహారాష్ట్రలోని కల్యాణ్ నగరంలో వంచిత్ బహుజన్ సభలో ఒవైసీ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎంతమంది దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, పేదలు, అగ్రవర్ణాలైన బ్రాహ్మణులకు భారతరత్న అవార్డులు ఇచ్చారని ప్రశ్నించారు. భారతరత్న అవార్డును బీఆర్ అంబేద్కర్‌కు గతంలో బలవంతంగా ఇచ్చారు కానీ, హృదయపూర్వకంగా ఇవ్వలేదని ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భార‌త‌ర‌త్న అవార్డు విష‌యంలో కేంద్రం తీరును గ‌మ‌నించాలని ఆయ‌న కోరారు. కాగా, రాజ్యాంగ‌బద్ద‌మైన ఎంపీ ప‌ద‌విలో ఉన్న ఓవైసీ ఇలా దేశ అత్యున్న‌త పుర‌స్కారంపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. తమ పార్టీ దేశ‌వ్యాప్త విస్త‌ర‌ణ‌కు సిద్ధ‌మైన ఓవైసీ మ‌హారాష్ట్రలో ప‌ర్య‌టిస్తున్న సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో ఈ వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఈ కామెంట్లపై కేంద్ర ప్ర‌భుత్వం , అధికార బీజేపీ త‌న స్పంద‌న తెలియ‌జేయాల్సి ఉంది.