Begin typing your search above and press return to search.

బీజేపీతో జ‌గ‌న్‌...ఓవైసీ కీల‌క వ్యాఖ్య‌లు...

By:  Tupaki Desk   |   24 Dec 2019 4:03 AM GMT
బీజేపీతో జ‌గ‌న్‌...ఓవైసీ కీల‌క వ్యాఖ్య‌లు...
X
పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల‌పై ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ మ‌రోమారు స్పందించారు. దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న ఆందోళ‌న‌లపై ఓవైసీ స్పందిస్తూ...ఆందోళ‌న‌ చేప‌ట్ట‌డం త‌మ‌ హ‌క్కు అని అన్నారు. కానీ హింస‌ను ఖండిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. నిర‌స‌న‌ల్లో హింస‌కు దిగుతున్న‌వారు.. ఆ ఆందోళ‌న‌ల‌కు శ‌త్రువులు అవుతార‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గురించి మ‌రింత ఆస‌క్తిక‌రంగా స్పందించారు. బీజేపీతో దోస్తీ మానుకుని తమతో కలిసిరావాలని అన్నారు.

యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సభలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో అసదుద్దీన్ ఓవైసీ ప్రసంగిస్తూ నిరసన సభకు వచ్చిన వారందరికీ ధన్యవాధాలు తెలిపారు. CAB - NRCలకు వ్యతిరేకంగా టీఆర్ ఎస్‌ ఓటేసినందుకు సీఎం కేసీఆర్‌ కు అసదుద్దీన్ ఓవైసీ థ్యాంక్స్ చెప్పారు. ఎన్ ఆర్‌ సీపై కేరళ ప్రభుత్వం స్టే తీసుకువచ్చినట్లు తెలంగాణలో కూడా స్టే తీసుకురావాలని కేసీఆర్‌ను కోరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా బీజేపీతో దోస్తి మానుకుని తమతో కలిసి రావాలని ఓవైసీ అన్నారు. బీజేపీతో దోస్తీ విష‌యంలో జ‌గ‌న్ పున‌రాలోచించుకోవాల‌ని - ఆ దోస్తీ ఏపీకి మేలు చేయ‌ద‌ని ఓవైసీ వ్యాఖ్యానించారు.

కాగా, తమ ప్రభుత్వం ఎన్ ఆర్సీకి వ్యతిరేకమని - రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించారు. మైనార్టీలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో భాగంగా కడప జిల్లాలో పర్యటించిన సీఎం జగన్‌.. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్ ఆర్సీ బిల్లు డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా ప్రభుత్వం తరుఫునే గతంలో వ్యాఖ్యలు చేశారని - ఆయన ప్రకటనకు కట్టుబడి ఉంటామని సీఎం స్పష్టం చేశారు. కాగా, జ‌గ‌న్ ఈ క్లారిటీ ఇవ్వ‌డం - ఓవైసీ ఆయ‌న‌కు ప్ర‌తిపాద‌న‌ను చ‌ర్చ తెర‌మీద‌కు తేవ‌డం గ‌మ‌నార్హం.