Begin typing your search above and press return to search.
షరీఫ్ ఇంటికి వెళ్లటం అసద్ కు నచ్చలేదు
By: Tupaki Desk | 4 Jan 2016 5:02 AM GMTబీజేపీ అన్నా.. ఆ పార్టీ నేతలన్నా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఒంటికాలి మీద విరుచుకుపడతారు. కమలనాథుల ప్రతి చర్యను తప్పు పట్టే అసదుద్దీన్ ఓవైసీ.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పటం.. ఆయన మనమరాలి పెళ్లికి సర్ ప్రైజ్ విజిట్ చేయటం తెలిసిందే. తన రష్యా పర్యటనలో భాగంగా తిరిగి వచ్చే సమయంలో అనూహ్యంగా పాక్ లోకి అడుగు పెట్టిన తీరుపై పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తాయి.
దాయాది దేశాల మధ్య స్నేహం పెంచేందుకు మోడీ తాజా పర్యటన సాయం చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అనవసరమైన ఉద్రిక్తల్ని మోడీ పర్యటన కారణంగా చెక్ పడే అవకాశం ఉందన్న మాట వినిపించింది. దౌత్యనీతిలో మోడీ అనుసరించిన వ్యూహంపై సానుకూల స్పందన వెల్లువెత్తుతుంటే.. మజ్లిస్ అధినేతకు మాత్రం మోడీ ట్రిప్ అస్సలు నచ్చలేదు.
శత్రుదేశంగా అభివర్ణించే పాకిస్థాన్ కు ప్రధాని మోడీ వెళ్లటం వెనుక ఏదో మతలబు ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం. ఒకవేళ పాక్ పర్యటన వెనుక ఏదైనా మతలబు ఉండి ఉంటే.. తనకున్న నెట్ వర్క్ తో దాన్ని బయటపెట్టే సత్తా అసద్ కు ఉందన్న విషయం మర్చిపోకూడదు. భారత్.. పాక్ క్రికెట్ మ్యాచ్ ల సందర్భంగా పలువురు పాక్ జట్టుకు మద్దతు పలకటం.. పాక్ కు అనుకూలంగా జెండాలు పట్టుకొని తిరగటంపై ఎన్నో విమర్శలు ఉన్నాయి.
ఇలాంటి వైఖరిని అనుసరించకూడదన్న విషయాన్ని ఒక్కరోజు కూడా తన బహిరంగ సభల్లో ప్రస్తావించని అసద్.. తాజాగా మోడీ పాక్ పర్యటనను తప్పు పట్టటం.. పాక్ ను శత్రుదేశంగా అభివర్ణించటం గమనార్హం. దాయాది దేశంతో స్నేహం.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గే ప్రయత్నాలు మోడీకి సరికొత్త ఇమేజ్ ను తీసుకొస్తాయని అసద్ భయపడుతున్నారు. ఇలాంటి వాటిని మొగ్గలోనే తుంచేందుకే విమర్శలు చేస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అనవసరమైన అనుమానాల్ని పెంచటం.. అర్థం లేని ఆరోపణలు రాజకీయాల్లో మామూలే. కానీ.. దేశ హితం కోరుకునే వారు ఆచితూచి మాట్లాడతారు. దాయాది దేశంలో కొత్త స్నేహం విషయంలో తొందరపాటు వ్యాఖ్యల కంటే ఆధారాలతో కూడిన ఆరోపణలు బాగుంటాయి. అసద్ తీరు చూస్తుంటే.. పాక్ తో మోడీ స్నేహం ఎందుకో నచ్చనట్లుందే..?