Begin typing your search above and press return to search.
ఒవైసీ చెప్పిన విడాకుల సత్యాలు
By: Tupaki Desk | 7 Nov 2016 6:17 AM GMTఎంఐఎం అధినేత - ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోమారు హిందూ-ముస్లింలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముస్లింలోని మంచితనం గురించి ప్రస్తావిస్తూనే పరోక్షంగా హిందువుల్లోని వివాహ సంబంధాలపై కొత్త విశ్లేషణ చేశారు. ఉమ్మడి పౌరస్మృతిని వ్యతిరేకిస్తూ ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన ఓవైసీ ఉమ్మడి పౌరస్మృతిని ముస్లిం సమాజం ఎన్నటికీ అంగీకరించబోదని స్పష్టం చేశారు. బూటకపు సర్వేలతో ముస్లింల సంస్కృతి - సంప్రదాయాలపై దాడి చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆక్షేపించారు. తలాక్ విషయంలో తప్పుడు సర్వేలను తెరపైకి తెస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆయన దుయ్యబట్టారు.
తలాక్ విషయంలో 50వేల మంది ముస్లిం మహిళలను సర్వే చేసినట్టు చెబుతున్నారని, వాస్తవానికి కనీసం రెండు వేల మంది అభిప్రాయాలను కూడా సేకరించలేదని తమ దృష్టికి వచ్చిందని ఓవైసీ చెప్పారు. తలాక్ పేరుతో ముస్లిం మహిళలను అన్యాయానికి గురి చేస్తున్నారని, వారికి న్యాయం చేస్తామంటూ ప్రధాని నరేంద్ర మోడీ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగినప్పుడు గోద్రా అల్లర్ల సమయంలో ముస్లింలపై అకృత్యాలు జరిగినప్పుడు మోడీ ఏం చేశారని ప్రశ్నించారు. వందలాది మంది ముస్లిం కుటుంబాలు సహాయక శిబిరాలలో తలదాచుకుంటే, ఇవి ఉత్పత్తి కేంద్రాలు కావంటూ రిలీఫ్ క్యాంప్ లను ఎత్తివేయించారని ఆక్షేపించారు. ఇప్పుడు ఉన్నపళంగా తలాక్ అంశాన్ని భూతద్దంలో చూపిస్తూ ముస్లిం మహిళల పట్ల అవ్యాజ్యమైన ప్రేమానురాగాలు కురిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. నిజానికి ముస్లిం సమాజంలోనే విడాకుల సంఖ్య అతి తక్కువగా ఉందని సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయన్నారు. గడిచిన 20 సంవత్సరాలలో కేవలం 0.4శాతం మాత్రమే విడాకులయ్యాయని, తమ తాత, ముత్తాతలు కూడా ఇప్పటికీ తమ బామ్మలతోనే కలిసి ఉంటున్నారని అన్నారు.
ముస్లిమేతర సమాజంలోనే విడాకులు ఎక్కువగా ఉన్నాయనే విషయం సర్వేలలోనే స్పష్టమవుతోందని ఓవైసీ ఎద్దేవా చేశారు. 47.13 కోట్ల మంది హిందువులు వివాహితులుగా ఉండగా, వారిలో పురుషుల సంఖ్య 23.35 లక్షలని, మహిళల సంఖ్య 23.75లక్షల పైచిలుకు ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందన్నారు. దీనిని బట్టి 43.56 లక్షల మంది ముస్లిమేతర మహిళలు ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నట్టు స్పష్టమవుతోందని అసదుద్దీన్ కామెంట్ చేశారు. అలాగే దేశంలో ముస్లింల జనాభా 17.22 కోట్లు ఉండగా, వారిలో 7.36 కోట్ల మంది వివాహితులుగా ఉన్నారని, వీరిలో కేవలం 2.70 లక్షల మంది మాత్రమే విడాకులు తీసుకున్నారని, ఇది 0.15 శాతమేనని పేర్కొన్నారు. సర్వే గణాంకాలనైనా పరిగణలోకి తీసుకుని ముస్లిం సమాజ సాంప్రదాయాలు - షరియత్ ను గౌరవించాలని కేంద్రానికి హితవు పలికారు. మోడీకి నిజంగానే ముస్లింల పట్ల ఆపేక్ష ఉంటే అమాయక ముస్లిం యువకులను బూటకపు ఎన్‌కౌంటర్లలో కాల్చి చంపేవారు కాదంటూ ఇటీవల మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగిన సంఘటనను ఉదహరించారు. 8మంది సిమి కార్యకర్తల ఎన్ కౌంటర్ పచ్చి బూటకమని - దీనిపై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. వాస్తవంగానే వారు నేరస్తులై ఉంటే చట్టపరంగా శిక్షించాల్సి ఉండేదని, అందుకు భిన్నంగా జైలు నుండి పారిపోయిన క్రమంలో గాలింపులు జరుపుతుండగా ఎన్ కౌంటర్ లో హతమైనట్టు కట్టుకథలు అల్లారని ఆయన ఆరోపించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/