Begin typing your search above and press return to search.
మోడీని కొత్తగా హింసిస్తున్న ఓవైసీ
By: Tupaki Desk | 12 Dec 2016 6:25 PM GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తనకున్న అసహనం, ఆగ్రహాన్ని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కొత్తగా వెళ్లగక్కారు. మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఓవైసీ మాట్లాడుతూ ప్రధానమంత్రి 150 ఏళ్లు బ్రతకాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి తనకు ప్రాణభయం ఉందని కోరుకుంటుంటే తాను మాత్రం ఆయన క్షేమం కోరుతున్నానని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి హోదాలో ఉండి ఒకసారి ప్రాణభయం అనటం, ఇంకోసారి నవ్వడం, మరోసారి ఏడ్వటం ఏమిటని అసద్ ప్రశ్నించారు.
కాగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ప్రధానిపై అసుదుద్దీన్ ఒవైసీ నిప్పులు చెరిగారు. ప్రధానమంత్రిని 'నియంతగా అభివర్ణించిన ఓవైసీ....తన అహాన్ని సంతృప్తి పరుచుకునేందుకు ప్రతి ఇంటినీ మోడీ కష్టాల్లోకి నెట్టేశారని ఆరోపించారు. ప్రజలు బ్యాంకుల చుట్టూ, ఏటీఎంల వెంట తిరుగుతూ ఉంటే... ప్రధానమంత్రి మాత్రం దేశం అంతటా కులాసాగా పర్యటిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఆవేదన చెందుతూ ఏటీఎంల వెంట తిరుగుతున్న ప్రజలే భవిష్యత్తులో మోడీని ఇంటి బాట పట్టించేందుకు పోలింగ్ కేంద్రాలను వేదికగా చేసుకుంటారని ఓవైసీ జోస్యం చెప్పారు. కాగా తనకు తానుగా ఫకీరు అని ప్రధానమంత్రి చెప్పుకోవడాన్ని ఓవైసీ ప్రశ్నించారు. 'ఒక ఫకీరు రూ.15 లక్షల సూట్ ధరిస్తారా? ప్రతిరోజూ కొత్త దుస్తులు, కొత్త షాల్ ధరించే వ్యక్తిని ఏ తరహా ఫకీర్ అనాలి? పేద ప్రజలను 50 రోజులపాటు కష్టాలు ఓర్చుకోమంటూ చెబుతున్న ఆయన 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినా ఏమాత్రం బాధపడటం లేదు. మీరు ఫకీరు కాదు...నియంత' అని ఓవైసీ మండిపడ్డారు. మోడీకి ఓట్లు వేసిన బడుగు బలహీన వర్గాలను వేదించడమే లక్ష్యంగా పెద్ద నోట్ల రద్దు ప్రవేశపెట్టినట్లుందని ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.