Begin typing your search above and press return to search.

తెలంగాణలో బీజేపీ బలపడటమా.? ఓవైసీ మాట

By:  Tupaki Desk   |   7 July 2019 6:05 AM GMT
తెలంగాణలో బీజేపీ బలపడటమా.? ఓవైసీ మాట
X
తెలంగాణలో బీజేపీ బలపడడానికి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. మొన్నటి ఎన్నికల వేళ ఉత్తర తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలవగానే బీజేపీలో జోష్ పెరిగింది. నిన్న హైదరాబాద్ వచ్చిన అమిత్ షా ఏకంగా బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొస్తామని ప్రకటించారు. అయితే ఈ విషయంపై కేసీఆర్, కేటీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇవ్వకపోయినా.. వారి మిత్రుడైన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాత్రం క్లారిటీ ఇచ్చాడు.

ఓవైసీ తాజాగా మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ పాలన ఉన్నంతకాలం బీజేపీకి ఇక్కడ నూకలు చెల్లినట్టేనని.. బీజేపీ తెలంగాణలో బలపడడం అసాధ్యమని స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న ఒడిషా,తమిళనాడు, తెలంగాణలో బీజేపీ ఎన్నిటికీ విజయం సాధించలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాల్లో కనుమరుగై ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతోందన్నారు.

తెలంగాణ ప్రజలు విద్వేశాలు రెచ్చగొట్టే బీజేపీ రాజకీయాలను ఆదరించరని.. సంఘ్ పరివార్ ను తరిమికొడతారని ఓవైసీ స్పష్టం చేశారు. ఐదేళ్లుగా తెలంగాణలో హిందూ ముస్లిం, బీసీ, గిరిజనులు, ఎస్సీల కోసం కేసీఆర్ చేసిన సంక్షేమపథకాలు దేశంలో ఎవ్వరూ చేయలేదని కొనియాడారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కే అండగా ఉంటారని స్పష్టం చేశారు.

ఇక ఉత్తర తెలంగాణలో బీజేపీది గెలుపు కాదని.. అక్కడ టీఆర్ఎస్ అతివిశ్వాసంతోపాటు అభ్యర్థులను సరైన వారిని ఎంపిక చేయకపోవడమే టీఆర్ఎస్ ఓటమికి కారణమని ఓవైసీ చెప్పుకొచ్చారు. ఇక కేంద్ర బడ్జెట్ లో పేదల ప్రజలపై బీజేపీ భారం వేసిందని.. పెట్రో ధరలు పెంచి నడ్డి విరిచిందన్నారు. ముస్లింలకు స్కాలర్ షిప్ప్ ఇవ్వడం లేదని విమర్శించారు.