Begin typing your search above and press return to search.

కేసీఆర్ స‌త్తా గురించి ఓవైసీ సాబ్ న‌మ్మ‌కం ఇది

By:  Tupaki Desk   |   28 July 2017 7:03 AM GMT
కేసీఆర్ స‌త్తా గురించి ఓవైసీ సాబ్ న‌మ్మ‌కం ఇది
X
హైద‌రాబాద్ ఇలాకాగా ఉన్న మ‌జ్లిస్ పార్టీ గ‌త కొద్దికాలంగా తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీతో స‌ఖ్య‌త‌గా ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ప‌లు ఎన్నిక‌లు మొద‌లుకొని ప్ర‌జా స‌మ‌స్య‌ల వ‌ర‌కు మ‌జ్లిస్ అధినేత‌లైన‌ ఓవైసీలు గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్‌ తో దోస్తీ న‌డుపుతున్నారు. ఏక‌కాలంలో అటు బీజేపీ ర‌థ‌సార‌థి నరేంద్ర మోడీతో, ఇటు ఎంఐఎం అధినేత ఓవైసీతో మితృత్వం కొన‌సాగించ‌డం కేసీఆర్ ప్ర‌త్యేకత అని పలువురు ప్ర‌శంసిస్తున్న తీరు టీఆర్ ఎస్ నేత‌ చాణ‌క్యానికి నిద‌ర్శ‌నంగా చెప్ప‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాదీల్లో పెద్ద ఎత్తున ప‌ట్టున్న ఓవైసీ టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ పై త‌మ‌కు ఉన్న న‌మ్మ‌కాన్ని మ‌రోమారు చాటుకున్నారు.

మజ్లిస్ అధినేత - ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తాజాగా ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్ చేశారు. ``తెలంగాణలో కేసీఆర్ ఉన్నంతకాలం... ఇక్క‌డ అధికారంలో వస్తామని కలలు కనడం, గెలుస్తామని ఆశపడటం బీజేపీ మరిచిపోవాలి. రాబోయే రోజుల్లో ప్రస్తుత ఎమ్మెల్యే - ఎంపీ సీట్లను కాపాడుకోవడం బీజేపీకి కష్టం`` అని అస‌దుద్దీన్ ఓవైసీ అభిప్రాయపడ్డారు. త‌ద్వారా గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్‌ కు రాష్ట్రంలో ఎంత ప‌ట్టు ఉందో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.
ఇదిలాఉండ‌గా...రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి కోవింద్‌ కు టీఆర్‌ ఎస్ మద్దతు ఇచ్చిన నేపథ్యంలో, కేంద్రంలో బీజేపీతో టీఆర్‌ ఎస్ జతకట్టడం ఖాయమని మజ్లిస్ వ్యతిరేకవర్గాల నుంచి ప్రచారం జరుగుతోంది. దీనిపై ముస్లిం వర్గాల్లో ఆందోళన కనిపిస్తున్న నేపథ్యంలో ఈ ట్వీట్ చర్చనీయాంశమైంది. బీహార్‌లో ఊహించనిరీతిలో బీజేపీతో నితీశ్‌కుమార్ జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన నేపథ్యంలో ట్వీట్ చేయడం గమనార్హం.