Begin typing your search above and press return to search.
ఏం అసద్ ఇప్పుడు మాటలు రావట్లేదా? స్పందించరేం?
By: Tupaki Desk | 2 April 2020 6:17 AM GMTతప్పులు జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంటుంది. అందుకు భిన్నంగా మౌనంగా ఉండటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. ఢిల్లీలోని మర్కజ్ ఎపిసోడ్ తో ఈ రోజున కరోనా వ్యాప్తి మరింత పెరగటమే కాదు.. దేశ వ్యాప్తంగా కొత్తగా పుట్టుకొస్తున్న కేసులన్ని దాని చుట్టూనే తిరగటం కొత్త తలనొప్పిగా మారింది.
అసలు.. మర్కజ్ వ్యవహారమే లేని పక్షంలో.. కరోనా మహమ్మారి నుంచి దూరంగా ఉండటమే కాదు.. మిగిలిన ప్రపంచ దేశాలకు భిన్నమైన పరిస్థితుల్లో దేశం ఉండేది. అందుకు భిన్నంగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు బయటకు వస్తున్నాయి. ఇప్పటికి.. ఈ సమావేశాలకు పాల్గొన్న వారిలో పలువురిని పోలీసులు గుర్తించలేకపోతున్నారు. వారికి.. వారు స్వచ్చందంగా బయటకురాని పరిస్థితి.
ఐసోలేషన్ వార్డు మీద ఉన్న భయాలు.. అవగాహన లేమి ఇప్పుడు మరిన్ని తప్పులు చేయిస్తుంది. ఇలాంటివేళ.. రంగంలోకి దిగి.. అందరికి అభయ హస్తాన్ని ఇవ్వాల్సిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ లాంటి వారు.. మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారు స్వచ్ఛందంగా బయటకు రావాలన్న మాటను చెబితే బాగుండేది. నిత్యం నీతులు వల్లించే అసద్ లాంటి పెద్ద మనిషి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు.కొద్దిమంది చేసిన పనికి దేశం మొత్తం మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది.
ఇప్పటికైనా మించి పోయింది ఏమీ లేదు. మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారు ఎవరికి వారు స్వచ్చందంగా బయటకు వచ్చి తమ వివరాలు వెల్లడించటంతో పాటు.. తాము ఎవరెవరిని కలిశామన్న వాస్తవాన్ని పంచుకుంటే.. వైరస్ వ్యాప్తిని అడ్డుకునే వీలుంది. అందుకు భిన్నంగా మౌనముద్ర దాలిస్తే.. మొదట నష్టం వాటిల్లేది.. నిజాన్ని దాటిన వారి కుటుంబాలకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నది మర్చిపోకూడదు. ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడూ అదే పనిగా మాట్లాడే అసద్ లాంటోళ్లు.. ప్రత్యేక పిలుపునిస్తే మంచిది.