Begin typing your search above and press return to search.
ఆర్మీ చీఫ్ వ్యాఖ్యల పై మండిపడ్డ అసదుద్దీన్ !
By: Tupaki Desk | 27 Dec 2019 9:57 AM GMTప్రస్తుతం కేంద్రం తీసుకు వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనల పై తాజాగా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హింసను ప్రేరేపిస్తూ.. ప్రజలను తప్పుడు మార్గం లో నడిపించేవారు నాయకులు కారని.. నాయకుడంటే ముందుండి నడిపించే వాడని ఓ కార్యక్రమం లో భాగంగా మాట్లాడుతూ చెప్పారు. యూనివర్సిటీలు, కాలేజీ స్టూడెంట్స్ నాయకుల వల్ల తప్పుదోవ పడుతున్నారని , అందుకే వారు హింసకు దిగుతున్నారన్నారు.
అయితే ఆర్మీ చీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలపై విపక్షాలు మండి పడ్డాయి. ఇదే సమయం లో నాయకుల రెచ్చగొట్టే ప్రసంగాల వల్లే విద్యార్థులు అల్లర్లు చేస్తున్నారన్న ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. అసదుద్దీన్ ఓవైసీ బిపిన్ రావత్‌పై ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయి లో విమర్శలు గుప్పించారు. సీఏఏ ఆందోళనల పై.. ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు.. దేశంలోని ప్రజా ప్రభుత్వాన్ని బలహీన పరచడమేనన్నారు. ప్రజస్వామ్యం లో నిరసనలు తెలుపడం ప్రాథమిక హక్కు అని.. ‘పౌరుల సంబంధిత అంశాల్లో సైన్యం జోక్యం చేసుకోకూడదని రాజ్యాంగం నిర్దేశిస్తున్నదన్నారు. ఇదే ఇతర దేశాలకు మన భారత దేశానికి ఉన్న వ్యత్యాసమన్నారు. విద్యార్థిగా తాను ఉద్యమాల్లో పాల్గొన్నానని ప్రధాని మోడీ కూడా చెప్పుకున్నారని చెప్పారు. ఎమర్జెన్సీ సమయం లోనూ ఇందిరకు వ్యతిరేకం గా విద్యార్థులు ఉద్యమించారని చెప్పారు అసదుద్దీన్ ఓవైసీ.