Begin typing your search above and press return to search.

ఆఖ‌రికి ఓవైసీకి కూడా లోకువ అయ్యావు బాబు

By:  Tupaki Desk   |   8 Sep 2018 2:38 PM GMT
ఆఖ‌రికి ఓవైసీకి కూడా లోకువ అయ్యావు బాబు
X
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులంద‌రికి కొత్త అస్త్రం ఇచ్చేశారా? తెలంగాణ‌లో అడ్ర‌స్ గ‌ల్లంతు అయిపోయిన స‌మ‌యంలో బాబు ఆతృత ఆయ‌న్ను న‌వ్వుల పాలు చేస్తోందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ - కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తాయని వార్తలు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుప‌డ్డారు.

కాంగ్రెస్, టీడీపీ పొత్తు అంశంపై అసదుద్దీన్ మాట్లాడుతూ.. టీడీపీ - కాంగ్రెస్ పొత్తును ప్రజలు తిప్పికొడతారన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ ఆ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటదని.. తెలుగువారి ఆత్మగౌరవం ఎక్కడ పోయిందని అన్నారు. ఏపీ సీఎంగా నాలుగేళ్లు ఏం చేయని చంద్రబాబు తెలంగాణకు వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. పొత్తుతో కాంగ్రెస్, టీడీపీ నిండా మునుగుతాయని పేర్కొన్నారు. కేసీఆర్ పాపులారిటీ చాలా ఎక్కువగా ఉంది. టీఆర్ ఎస్ - ఎంఐఎంను ఒంటరిగా ఢీకొనే దమ్ములేక పొత్తుల కోసం పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు. తమకు పదవులపై ఎప్పుడూ ఆశ లేదన్న ఓవైసీ.. మైనార్టీలు - బలహీనవర్గాల కోసం తమ పార్టీ పాటుపడుతుందన్నారు. ఎంతో విశ్వాసం ఉండడం వల్లే టీఆర్ ఎస్ పదవీకాలం ఉన్నా ఎన్నికలకు సిద్ధమైంది. ఇతర రాజకీయ పార్టీలు ఒక్క రోజు కూడా పదవిని వదులుకోవన్నారు.