Begin typing your search above and press return to search.

మోదీ క్షమాపణలు చెప్పాల్సిందే : ఒవైసీ !

By:  Tupaki Desk   |   10 May 2021 6:30 AM GMT
మోదీ క్షమాపణలు చెప్పాల్సిందే : ఒవైసీ !
X
దేశంలోని ప్రతి ఒక్కరికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. దేశంలో కరోనా మహమ్మారి కలకలం తో ఆస్పత్రుల్లో సరైన సమయానికి బెడ్స్ , అలాగే ఆక్సిజన్ దొరకక మరణించిన వారికి మోదీ క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఈ సమయంలో పార్లమెంట్ ను , అలాగే మీడియా ను ఎదుర్కొనేందుకు మోదీ భయపడుతున్నారని విమర్శలు చేశారు. అలాగే దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఫ్రీ గా కరోనా వ్యాక్సిన్ అందజేయాలని, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కారణంగా చదువు లేని వారు వ్యాక్సిన్ కోసం నానా అవస్థలు పడాల్సి వస్తుందని అన్నారు. అలాగే దేశంలోని మిగిలిన ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్లు తయారు చేసే విధానం ఎందుకు అమలు చేయడం లేదని అన్నారు. దేశాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న నేపథ్యంలో కేంద్రం అనుసరిస్తున్న వ్యాక్సిన్ విధానాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా తప్పుబట్టారు.

దేశంలో తగినన్ని నిల్వలు లేవని తెలిసి కూడా మోదీ తన బొమ్మతో కూడిన వ్యాక్సిన్ల బాక్సులను విదేశాలకు ఎందుకు ఎగుమతి చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు. అలాగే విదేశాల్లో తయారైన వ్యాక్సిన్లను భారత్ లో పంపిణీ చేసేందుకు ఎందుకు అనుమతించలేదని ,వ్యాక్సిన్లపై ఇప్పటికీ ఎందుకు జీఎస్టీ వసూలు చేస్తున్నారని నిలదీశారు. మీ దారుణమైన వ్యాక్సినేషన్ విధానాన్ని ఇప్పుడు రాష్ట్రాలకు బదలాయించాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ప్రశ్నించారు. కేంద్రీకృత విధానంలో వ్యాక్సిన్ సేకరణ చేపట్టాలని, అయితే, పూర్తి వికేంద్రీరణ పద్ధతిలో వ్యాక్సిన్లను రాష్ట్రాలకు పంపిణీ చేయాలని సూచించారు. గందరగోళంగా ఉన్న ఆన్ లైన్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని పక్కనబెట్టాలని, ప్రజలందరికీ ఎంతో సులువుగా వ్యాక్సిన్లు ఇచ్చేలా కార్యాచరణ రూపొందించాలని పిలుపునిచ్చారు.