Begin typing your search above and press return to search.
దేశవ్యాప్త విస్తరణలో ఎంఐఎం సక్సెస్ అయినట్టేనా?
By: Tupaki Desk | 12 Nov 2020 12:30 AM GMTఆలిండియా మజ్లిస్ ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ - MIM...ప్రాంతీయ పార్టీగా ఒక మతం ప్రాతిపదికన ఏర్పడిన పార్టీ ఇది. కొంత కాలం క్రితం వరకు హైదరాబాద్ పాతబస్తీకే పరిమితమై జంటనగరాలలో మాత్రమే ప్రభావితం చూపగలిగిన పార్టీగా ఎంఐఎంకు పేరుంది. ఓ ఎంపీ, 7 అసెంబ్లీ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఐఎం మెల్లగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ఆ తర్వాత క్రమక్రమంగా దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలన్న యోచనతో ఏపీ, తెలంగాణతోపాటు ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో తన పరిధిని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాలు, ప్రణాళికలను అమలు చేస్తోన్న ఎంఐఎం గతంలో యూపీ, మహారాష్ట్రలలో కొంతవరకు సక్సెస్ అయింది. తాజాగా, బిహార్ ఎన్నికల్లోనూ ఎంఐఎం సత్తా చాటింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాల్లో ఎంఐఎం గెలుపొంది మరిన్ని రాష్ట్రాల్లో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది.
దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలని ఎంఐఎం గత పదేళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. తొలి ప్రయత్నంలోనే 2 ఎమ్మెల్యే సీట్లను దక్కించుకున్న ఎంఐఎం 2019 ఎన్నికల్లో ఒక లోక్ సభ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏకంగా రెండోస్థానం దక్కించుకుంది. ఇక, బిహార్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఎంఐఎం 5 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ప్రధానంగా ముస్లిం ఓటర్లను నమ్ముకొని బరిలోకి దిగుతున్న ఎంఐఎం...క్రమక్రమంగా పోటీ చేసిన రాష్ట్రాల్లో కేడర్ ను పెంచుకుంటూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తోంది. తెలంగాణ, ఏపీ, యూపీ, మహారాష్ట్ర, బిహార్....ఇలా ఒక్కో రాష్ట్రానికి విస్తరిస్తూ బలం పెంచుకుంటోంది. బిహార్ ఎన్నికల్లో సాధించిన విజయంతో భవిష్యత్తులో మరిన్ని రాష్ట్రాలకు విస్తరించే యోచనలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఉన్నారని తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా పార్టీని మరిన్ని రాష్ట్రాలకు విస్తరించేందుకు అసద్ వ్యూహాలు సిద్ధంచేస్తున్నట్టు తెలుస్తోంది.