Begin typing your search above and press return to search.
‘ఉరి’లోనూ మతం రొచ్చు తెచ్చిన ఓవైసీ
By: Tupaki Desk | 20 Dec 2016 1:22 PM GMTమజ్లిస్ అధినేత.. హైదరాబాద్ ఎంపీ..అసదుద్దీన్ ఓవైసీ తీరు తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదంగా ఉంటాయన్న విషయం మీద ఎవరికి మరో అభిప్రాయం అంటూ ఉండదు. ప్రతి విషయంలోనూ మతానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే ఆయన.. కొన్ని విషయాల మీద మాట్లాడేటప్పుడు కనీసం సంయమనం వహించాలన్న ఆలోచనను కూడా మరవటం విస్మయాన్ని రేకెత్తిస్తుందని చెప్పాలి. రాజకీయ పార్టీల మీదా.. రాజకీయ నేతల మీదా విమర్శలు చేయటాన్ని కొంతమేర అర్థం చేసుకోవచ్చు.
విచారణ సంస్థల విచారణ మీద తప్పులు వెతుకుతూ ఆయన చేస్తున్న విమర్శలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల నిందితులపై కోర్టు తీర్పుపై స్పందించిన ఓవైసీ.. కోర్టు తీర్పును అంగీకరిచాల్సిందేనన్న ఆయన.. ఉగ్రవాదులు శిక్షించబడాలంటూనే జాతీయ భద్రతా సంస్థపై విమర్శలు చేశారు.
ఎన్ ఐఏ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదంటూ వరుస ట్వీట్లతో విమర్శించిన ఆయన.. సదరు సంస్త ఒక మతాన్నే లక్ష్యంగా చేసుకుందని ఆరోపించటం గమనార్హం. దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసుపై దూకుడు చూపించిన ఎన్ఐఏ.. ముస్లిమేతరుల ప్రమేయం ఉన్న ఇతర బాంబు పేలుళ్ల కేసుల విషయంపై ఎందుకు దూకుడు ప్రదర్శించటం లేదని ఓవైసీ ప్రశ్నించారు.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసు 1992 నుంచి అలానే పెండింగ్ లో ఉండిపోయిందన్న ప్రశ్నను లేవనెత్తిన ఓవైసీ.. దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులకు కోర్టు ఉరిశిక్ష విధించిన సందర్భంలో గతాన్ని గుర్తు చేస్తూ మాట్లాడారు. ఒకవేళ ఏదైనా కేసు నెమ్మదిగా నడుస్తుందన్న భావనలో ఉంటే.. ఆ విషయాన్ని విడి రోజుల్లో ప్రస్తావించని ఓవైసీ.. ఉగ్రభూతాలకు శిక్ష వేసిన సమయంలోనే గుర్తుకు రావటం ఏంటి? దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్లలో 18 మంది దుర్మరణం పాలు కావటంతో పాటు.. వందలాది మంది గాయపడిన విషయాన్ని అసద్ మర్చిపోయారా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/