Begin typing your search above and press return to search.
ముందు ఉగ్రవాదుల్లో ముస్లింలను లెక్కించు ఓవైసీ
By: Tupaki Desk | 15 Feb 2018 5:56 PM GMTఇటీవల కశ్మీర్ లోని సుంజ్వాన్ సైనిక శిబిరంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో ఐదుగురు ముస్లిం సైనికులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేసిన ఎంఐఎం అధ్యక్షుడు - హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి అనూహ్యమైన పంచ్ ఇచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై తన ట్విట్టర్ లో ఎదురుదాడి చేశారు. ‘‘సుంజ్వాన్ దాడిలో మృతిచెందిన ముస్లిం సైనికులను ఒవైసీ లెక్కిస్తున్నారు - కానీ ఉగ్రవాద సంస్థల్లో ఉన్న ముస్లింలను కూడా ఆయన లెక్కించాలి’ అని తన ట్వీట్ లో సుబ్రమణ్యస్వామి సూచించారు. బాబ్రీ మసీదు - కశ్మీర్ సమస్యపై ఒవైసీ - సుబ్రమణ్యస్వామి ఇద్దరూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు.
మరోవైపు - కేంద్రమంత్రి - బీజేపీ నేత పొన్ రాధాకృష్ణన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ఇంకెంతో కాలం శాంతియుతంగా ఉండలేదని - రాష్ట్రం తీవ్రవాదులకు శిక్షణ కేంద్రంగా మారుతున్నదని ఆయన వ్యాఖ్యానించారు. 1998 ఫిబ్రవరి 14న జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో మృతులకు నివాళులర్పించేందుకు వివిధ హిందూసంస్థలు, బీజేపీ గురువారం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి, బీజేపీ నాయకుడు పొన్ రాధాకృష్ణన్ మాట్లాడారు. ‘తమిళనాడు ఎంతోకాలం శాంతియుత రాష్ట్రంగా ఉండలేదు. ఇక్కడి పరిపాలనకు వ్యతిరేకంగా నక్సలైట్లు - తమిళ అతివాదులు - ఇస్లామిక్ ఉగ్రవాదులు అందరూ చేతులు కలిపారు. గత ఏడాది జల్లికట్టు కోసం జరిగిన ఆందోళనలే ఇందుకు నిదర్శనం’ అని రాధాకృష్ణన్ చెప్పారు. ఈ దళాలు వచ్చే 10 నుంచి 20 ఏళ్ల సుదీర్ఘ ప్రణాళికతో ముందుకెళ్తున్నాయని, ఈ విషయం ప్రభుత్వం - పోలీసుశాఖకు తెలిసిందా లేదా అనేది తనకు తెలియదని పేర్కొన్నారు.
20 ఏళ్ల కిందట బీజేపీ నేత ఎల్‌కే అద్వానీ ఎన్నికల సభ నిర్వహిస్తుండగా జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 52 మంది మృతిచెందగా - వారికి నివాళులర్పించేందుకు రాకుండా ప్రభుత్వం తనను అడ్డుకున్నదని ఆరోపించారు. మృతుల కోసం స్మారక చిహ్నాన్ని ఏర్పాటుచేసేందుకు కూడా ప్రభుత్వం అనుమతించలేదని విమర్శించారు. అందుకే తానీ వ్యాఖ్యలు చేస్తున్నానని తెలిపారు