Begin typing your search above and press return to search.
అనుకున్నది సాధించిన ఓవైసీ
By: Tupaki Desk | 3 Nov 2015 6:20 AM GMTతెలంగాణలో పట్టు సాధించినప్పటికీ పొరుగు రాష్ర్టాల్లో గెలుపు ఢంకా మోగించాలనుకున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కల నెరవేరింది. తాజాగా వెలువడిన ఉత్తరప్రదేశ్ జిల్లా పంచాయతీ ఎన్నికలతో పాటు మహారాష్ర్టలోని కల్యాణ్ డోంబ్రివలీ మున్సిపల్ ఎన్నిక, మహారాష్ర్టలోని పంచాయతీ ఎన్నికల్లో ఎంఐఎం తన ఖాతా తెరవడమే కాకుండా చెప్పుకోదగ్గ స్థాయిలోనే సీట్లను సాధించింది.
యూపీ రాష్ట్రవ్యాప్తంగా 3112 జిల్లా పంచాయతీ, 77,576 బ్లాక్ పంచాయతీ సభ్యుల ఎన్నిక కోసం నాలుగు దశల్లో ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించింది. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ ఈ ఎన్నికల్లో ఖాతా తెరిచి 8 పంచాయతీలను గెలుచుకొని యూపీలోనూ తన సత్తాను చాటింది. మరోవైపు కల్యాణ్ డోంబ్రివలీ మున్సిపల్ ఎన్నికల్లో రెండు వార్డులు గెలుచుకుంది. లాతూర్ జిల్లా పంచాయతీ ఎన్నికల్లోనూ రెండు స్థానాలను తన ఖాతాలో జమచేసుకుంది. మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో రెండు స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే.
తెలంగాణ తర్వాత కీలక రాష్ర్టాల్లోనూ పాగా వేయడమే తమ లక్ష్యమని చెప్పిన ఓవైసీ ఆ క్రమంలో వేగంగా అడుగులు వేస్తున్నారు. స్థానిక, పురపాలక ఎన్నికల్లో పోటీ చేస్తూ పతంగిని ఎగరేస్తున్నారు.