Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ ను తప్ప అందరిని తిట్టేస్తున్న ఓవైసీ

By:  Tupaki Desk   |   23 Jan 2016 10:12 AM IST
టీఆర్ ఎస్ ను తప్ప అందరిని తిట్టేస్తున్న ఓవైసీ
X
గ్రేటర్ ఎన్నికల్లో చిత్రమైన దృశ్యం కనిపిస్తోంది. ఎవరికి వారుగా అన్నట్లు బరిలోకి దిగినప్పటికీ.. అధికార టీఆర్ ఎస్.. విపక్ష మజ్లిస్ మధ్య అనుబంధం అనధికారికంగా కొనసాగుతోంది. ఎన్నికల సందర్భంగా విపక్షం అధికారపక్షంపై విరుచుకుపడటం సర్వ సాధారణం. కానీ.. మజ్లిస్ వ్యవహారం అందుకు భిన్నంగా సాగుతోంది. తెలంగాణ అధికారపక్షమైన టీఆర్ ఎస్ పై ఒక్క విమర్శ చేయని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. అందుకు భిన్నంగా కాంగ్రెస్.. టీడీపీ.. బీజేపీలతో మీద విరుచుకుపడుతున్నారు. తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

తమ విజయాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్.. టీడీపీ.. బీజేపీలు ఏకమై తమ మీద కుట్ర చేస్తున్నాయని.. తమ విజయాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఆరాచకాలు భరించలేకనే ఆ పార్టీతో కటీఫ్ చేసుకున్నట్లు చెబుతున్న ఓవైసీ.. గతంలో మజ్లిస్ ను ప్రశంసించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అందుకు భిన్నంగా విమర్శలు చేయటాన్ని ప్రస్తావించారు.

గ్రేటర్ లో తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న అసదుద్దీన్ ఓవైసీ.. తెలంగాణ అధికారపక్షంపై విమర్శలు చేయకుండా జాగ్రత్త పడటం ఆసక్తికరంగా మారింది. ఎవరికి వారు పోటీ చేస్తున్నప్పటికి.. రహస్య స్నేహితుడి హోదాలో టీఆర్ ఎస్.. మజ్లిస్ మధ్య లోగుట్టు సంబంధాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.