Begin typing your search above and press return to search.
గెలిచినా.. ఓవైసీకి మాత్రం ఈసారి భారీ షాకే!
By: Tupaki Desk | 23 May 2019 6:57 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు.. మూడు నియోజకవర్గాల్లో గెలుపు ఒకరివైపే ఉంటుంది. అలాంటి నియోజకవర్గాల్లో హైదరాబాద్ ఎంపీ స్థానం ఒకటి. ప్రధాని మోడీ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లాంటోళ్లకు సైతం సూటిగా సవాల్ విసిరి.. హైదరాబాద్ ఎంపీ స్థానానికి వచ్చి పోటీ చేసే దమ్ముందా? అని ప్రశ్నించటం మజ్లిస్ అధినేత అసుద్దీన్ ఓవైసీకి మాత్రమే చెల్లుతుంది.
అలాంటి అసద్ కు ఈసారి మాత్రం దిమ్మ తిరిగే షాక్ తప్పట్లేదు. తన అడ్డా లాంటి హైదరాబాద్ ఎంపీ స్థానంలో వెనుకబడి ఉండటం ఊహించలేని పరిస్థితి. ఒకట్రెండు రౌండ్లలో అధిక్యతను ప్రదర్శిస్తున్నప్పటికీ మాత్రం.. ఎక్కువసార్లు అసద్ వెనుకబడి ఉండటం కనిపించింది.
మజ్లిస్ తప్పించి మరే పార్టీ అధిక్యం అన్నది కనిపించని హైదరాబాద్ లోక్ సభ స్థానంలో మజ్లిస్ వెనుకబడి పోవటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తుది ఫలితం అసద్ కు అనుకూలంగా రావొచ్చేమో కానీ.. కొన్ని రౌండ్లలో ఆయన వెనుకబడిపోవటం చూసినప్పుడు మాత్రం.. హైదరాబాద్ ఎంపీ స్థానంలో మజ్లిస్ జెండా మాత్రమే ఎగురుతుందన్న మాటలో నిజం లేదన్న భావన కలగటం ఖాయం. గెలుపు తర్వాత.. ఊహించని రీతిలో తాను వెనుకబడి ఉండటాన్ని అసద్ జీర్ణించుకోలేకపోతారని చెప్పక తప్పదు.