Begin typing your search above and press return to search.

అయోధ్య కేసులో ఈ ట్విస్టుల‌న్నీ అందుకేనా?!

By:  Tupaki Desk   |   30 Oct 2018 3:11 PM GMT
అయోధ్య కేసులో ఈ ట్విస్టుల‌న్నీ అందుకేనా?!
X
అయోధ్య భూ వివాదం కేసులో ఊహించ‌ని ట్విస్టేమి చోటుచేసుకోలేదు! ఇటు పార్టీల ఎత్తుగ‌డ‌లు అటు కోర్టుల తీర్పుల కార‌ణంగా అదే ఉత్కంఠ కొన‌సాగుతోంది. అయోధ్య‌పై త్వరితగతిన విచారణ జరపాలన్న విజ్ఞప్తులను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. వచ్చే ఏడాది జనవరి మొదటివారంలో ఈ కేసు విచారణ తేదీని సంబంధిత ధర్మాసనం నిర్ణయిస్తుందని తెలిపింది. రామజన్మభూమి-బాబ్రీమసీదు భూ వివాదంపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై తగిన ధర్మాసనం ఏర్పాటవుతుందని - ఆ ధర్మాసనమే ఈ కేసుకు సంబంధించిన భవిష్యత్ విచారణ ప్రక్రియను నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. మాకు మావైన సొంత ప్రాధాన్యాలున్నాయి. సదరు అంశం (అయోధ్య కేసు)పై విచారణ జనవరిలోనా - ఫిబ్రవరిలోనా - మార్చిలోనా అన్న దానిపై సంబంధిత ధర్మాసనమే నిర్ణయం తీసుకుంటుంది అని సుప్రీంకోర్టు పేర్కొంది. సోమవారం కొద్దిసేపు జరిగిన వాదనల అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది.

అయితే, ఈ నిర్ణయం పలు హిందూసంస్థలను తీవ్ర నిరాశకు గురి చేసింది. మ‌రోవైపు అయోధ్య విష‌యంలో ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ త‌న‌దైన శైలిలో స్పందించారు. అయోధ్య విషంయ‌లో ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్న బీజేపీకి... అయోధ్య రామ మందిర నిర్మాణంపై ఆర్డినెన్స్‌ జారీ చేసే దమ్ముందా.? అంటూ బ‌హిరంగ స‌వాల్ విసిరారు. కోర్టు తీర్పు ఇచ్చేందుకు స‌మ‌యం తీసుకుంటున్న స‌మ‌యంలోనే..ఓవైసీ ఇలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌డం స‌హ‌జంగానే ఓవైసీల దూకుడుపై ప‌లువురి దృష్టిని సారించేందుకు కార‌ణంగా మారుతుంది. స‌రే ప‌క్కా మ‌త‌త‌త్వ అజెండాతో ముందుకు సాగుతున్న ఓవైసీ స‌వాల్ విస‌ర‌డంలో వింతేమీ లేదు. కానీ దీనికి బీజేపీ ఎలా స్పందిస్తుంద‌నేది అస‌లు ప్ర‌శ్న‌.

ఓవైసీ స‌వాల్ విసిరిన రెండ్రోజులు అవుతున్నా..బీజేపీ స్పందించ‌లేదు. అదే స‌మయంలో కేంద్ర ప్ర‌భుత్వం సైతం ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. దీంతో మ‌ళ్లీ అయోధ్య అంశం రాబోయే ఎన్నిక‌ల్లో ఇరు పార్టీల‌కు ఉప‌యోగ‌ప‌డే ఓట్ల ఎత్తుగ‌డ‌గా మారే ఎజెండానేనా అంటూ ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. రామజన్మభూమి అంశంలో సుప్రీంకోర్టు ఇకనైనా రోజువారీ విచారణ చేపడుతుందని హిందూ సంస్థలు ఆశించ‌గా...సుప్రీంకోర్టు నిర్ణయం భిన్నంగా రావటంతో - అయోధ్యలో రామాలయ నిర్మాణానికి వీలుగా వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చట్టం చేయాలని - లేదంటే ఆర్డినెన్స్‌ నైనా తీసుకురావాలంటూ డిమాండ్ చేస్తారు. మరోవైపు - కాంగ్రెస్ తదితర పార్టీలు - ముస్లిం సంఘాలు - కేసులోని పలు భాగస్వామ్యపక్షాలు మాత్రం సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచి చూస్తామని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో బీజేపీ నిర్ణ‌యం అంద‌రిలోనూ ఉత్కంఠ‌ను రేకెత్తిస్తోంది.