Begin typing your search above and press return to search.
ఓవైసీ కలకలం...భారతరత్న అవార్డులు బ్రాహ్మణులకేనా?
By: Tupaki Desk | 7 Feb 2019 5:50 PM GMTహైదరాబాద్ పాతబస్తీ నేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తాజాగా మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో మతం ఆధారంగా వ్యాఖ్యలు చేసిన ఓవైసీ...తాజాగా దేశంలోనే అత్యున్నత పురస్కారమైన భారతరత్న గురించి ఆయన ఆశ్చర్యకరమైన రీతిలో స్పందించారు. సాక్షాత్తు పార్లమెంటు వేదికగా ఆయన భారతరత్నపై కలకలం రేకెత్తించే కామెంట్లు చేశారు. భారతరత్న ప్రతిభ ఆధారంగా ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు.
ఇప్పటి వరకు ఎంతమంది దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, పేదలు, అగ్రవర్ణాలైన బ్రాహ్మణులకు భారతరత్న అవార్డులు ఇచ్చారని ఓవైసీ ప్రశ్నించారు. భారతరత్న అవార్డు విషయంలో కేంద్రం తీరును గమనించాలని ఆయన కోరారు. పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయకు అవార్డు ఇవ్వడం వెనుక కారణాలు ఆలోచించాలని ఆయన కోరారు. అత్యున్నత పౌర అవార్డు ప్రతిభ ఆధారంగా ఇవ్వాలని ఆయన సూచించారు.
కాగా, గత నెలలో సైతం ఓవైసీ ఇదే వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని కల్యాణ్ నగరంలో వంచిత్ బహుజన్ సభలో ఒవైసీ మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్‌కు గతంలో బలవంతంగా ఇచ్చారు కానీ, హృదయపూర్వకంగా ఇవ్వలేదని ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికా, సామాజికవేత్త నానాజీ దేశ్‌ముఖ్‌లకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చిన అనతంరం ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కాగా, రాజ్యాంగబద్దమైన ఎంపీ పదవిలో ఉన్న ఓవైసీ ఇలా దేశ అత్యున్నత పురస్కారంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.