Begin typing your search above and press return to search.
జనగణమనపై ఓవైసీ మార్కు రియాక్షన్
By: Tupaki Desk | 1 Dec 2016 5:30 PM GMTసినిహాహాళ్లలో చిత్ర ప్రదర్శనకు ముందు జాతీయ గీతాన్ని ఆలపించడాన్ని సుప్రీంకోర్టు తప్పనిసరి చేసింది. జాతీయ గీతం పట్ల, జాతీయ పతాకం పట్ల గౌరవభావాన్ని ప్రదర్శించడం మాతృభూమి పట్ల గౌరవాన్ని ప్రేమను ప్రతిఫలిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. వారంలోగా ఈ ఆదేశాలు అమలు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించిన హైద రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. జాతీయ గౌరవానికి అవమానాలను నిరోధించే చట్టంలోగానీ, జాతీయ గీతం విషయంలో కేంద్ర హోంశాఖ జారీ చేసిన సూచనల్లోగానీ ఆ గీతం ఆలపించే సమయంలో అందరూ విధిగా నిలబడాలని పేర్కొనలేదని, ఈ మేరకు చట్టాన్ని సవరించాలని సూచించారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించిన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ.. దీని ద్వారా దేశభక్తి భావన పెంపొందుతుందా? అని సందేహం వ్యక్తం చేశారు. పార్లమెంటు వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతీయ గౌరవానికి అవమానాలను నిరోధించే చట్టం-1971, జాతీయ గీతం విషయంలో కేంద్ర హోంశాఖ జారీ చేసిన సలహాలు జాతీయ గీతం ఆలపించే సమయంలో ప్రజలందరూ నిలబడాలని పేర్కొనడం లేదని ఒవైసీ అన్నారు. ఈ విషయంలో సదరు సలహాలను సరిదిద్దేలా చట్టాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ష సుప్రీంకోర్టు ఆదేశాలు సరైనవే. వాటిని పాటించాల్సిందే. కానీ.. జాతీయ గీతం ఆలపించేటప్పుడు ప్రజలు లేచి నిలబడాల్సిందేనా? అన్నదే ప్రశ్న. ఈ ఉత్తర్వుల ద్వారా దేశభక్తి, జాతీయభావన పెంపొందుతాయా?" అని ఒవైసీ ప్రశ్నించారు. గత నెలలో గోవాలోని ఒక మల్టీప్లెక్స్ థియేటర్‌లో ఒక వికలాంగుడు జాతీయ గీతాలాపన సమయంలో లేచి నిలబడలేదని చితకబాదిన ఘటనను ప్రస్తావించిన ఒవైసీ.. ఇలాంటి విషయాల్లో ఏం చేయాలని ప్రశ్నించారు. "చిన్నప్పటి నుంచే పిల్లలకు జాతీయ గీతం పట్ల గౌరవం కలిగేలా బోధించాలి. 1971 చట్టాన్ని, హోంశాఖ సూచనలను సవరించాలి" అని ఆయన అన్నారు. "ఒక దేశస్థుడిగా ఉండవచ్చు. కానీ.. దేశభక్తుడిగా ఉన్నామా? లేదా? అన్నదే ముఖ్యం. ఇది వీర జాతీయవాదుల ప్రభుత్వం. వారితో ఏకీభవించనివారంతా దేశవ్యతిరేకులే" అని ఆయన కేంద్ర ప్రభుత్వానికి చురకలు వేశారు.
కాగా జాతీయ గీతాలాపనపై సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై బీజేపీ హర్షం ప్రకటించింది. ఇది జాతీయభావం స్ఫూర్తిని - ఏక్ భారత్ - శ్రేష్ఠభారత్ అనే భావనను బలోపేతం చేస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ శర్మ చెప్పారు. జాతీయ గీతం - జాతీయ పతాకం ఒక దేశంగా మనల్ని ఐక్యం చేస్తుందని, మరింత బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. ఇది చాలా మంచి నిర్ణయం. దేశ ప్రజల్లో - ప్రత్యేకించి యువతరంలో దేశభక్తి భావన పెంపొందేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉపకరిస్తాయి అని కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు చెప్పారు. "మన జాతీయ గీతాన్ని గౌరవించాల్సిందే. జాతీయ గీతం ఆవశ్యకత గురించి యువతరానికి చెప్పాలి. ప్రజలు ఈ ఆదేశాలను పాటించేందుకు తగిన వాతావరణం కల్పించాలి. ఇది కేవలం గీతాన్ని ఆలపించడం కాదు. గర్విచతగిన అంశం" అని మాజీ సినీ నటుడు, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ అన్నారు. "అవును.. జాతీయ గీతాన్ని ఆలపించాల్సిందే. త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించాల్సిందే. ఆలపించే ఆ జాతీయ గీతం మనదేగా? సోమాలియాది కాదుగా" అని సినీ నటుడు, బీజేపీ లోక్‌సభ సభ్యుడు పరేష్‌రావల్ అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/