Begin typing your search above and press return to search.
జర్నలిస్టుతో ఓవైసీ ప్రేమాయణం..ఆఖరికి ఓవైసీ ఏం చేశాడంటే..!
By: Tupaki Desk | 14 Jan 2020 2:59 PM GMTహైదరాబాద్ ఎంపీ - మజ్లిస్ పార్టీ రథసారథి అసదుద్దీన్ ఓవైసీకి మాస్ లీడర్ అనే పేరుంది. ముస్లింలకు అండగా ఉండటంలో ఏ మాత్రం తన భావాలను దాచుకోని ఓవైసీ స్థానిక అంశాలతోపాటు జాతీయ - అంతర్జాతీయాంశాలపై స్పందిస్తుంటారు. తద్వారా వివిధ వర్గాలు ఆయన్ను టార్గెట్ చేసుకుంటాయి. అయితే, ఆయన కొత్తగా వార్తల్లోకి ఎక్కారు. ప్రేమాయణం రూపంలో. ఓవైసీ ఓ మీడియా ప్రతినిధితో ప్రేమలో ఉన్నారట. ఆమెకు ఓవైసీకి మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఓవైసీ స్వయంగా బహిరంగ క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
జర్నలిజం గురించి `సమగ్రంగా` కొందరికే తెలుసు. కీలకమైన రిపోర్టింగ్ - డెస్క్ విధుల్లో భాగంగా పాత్రికేయులు వివిధ రకాలైన బాధ్యతలు నిర్వహిస్తారు. ప్రధానంగా రిపోర్టింగ్ కత్తి మీద సాము. వారికి బీట్ పేరుతో ఒక్కో రాజకీయ పార్టీ లేదా ప్రభుత్వ విభాగాల్లోని కొన్ని శాఖలు కేటాయిస్తుంటారు. అలా విధి నిర్వహణలో వారు సహజంగానే సంబంధిత ముఖ్యులతో వృత్తిపరమైన సంబంధాలు కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో టీవీ స్టూడియోల్లో ఉండే వారు సైతం నాయకులతో మంచి పరిచయాలు పెంచుకుంటారు. అలా ఓ పరిచయం ఉన్న ఓ జాతీయ మీడియా జర్నలిస్టు పలు సందర్భాల్లో...వివిధ అంశాల్లో ఓవైసీని ఇంటర్వ్యూ చేసింది. ఆయన అభిప్రాయాలు తీసుకుంది.
అయితే, ఇక్కడే అసలు ట్విస్టు జరిగింది. అసదుద్దీన్‌తో వివిధ సందర్భాల్లో జరిపిన ఇంటర్వ్యూలు, డిస్కషన్ల క్లిప్పింగులను సేకరించి - వాయిస్ మార్ఫింగ్ చేసి వారిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్టుగా సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పేరొందిన అసద్ - జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న జర్నలిస్ట్ కావడంతో...సహజంగానే ఈ సంభాషణలు వైరల్ అయ్యాయి. దీనిపై ఓవైసీ ఘాటుగా స్పందించారు. `నా రాజకీయాల మీద, ప్రసంగాల మీద ఏమైనా రాసుకోండి. మహిళలను కించపరచటం మంచి పద్ధతి కాదు. అందరికీ అక్క చెల్లెళ్లు ఉన్నారు. ఏ మహిళ గురించి కూడా ఇలా తప్పుగా రాయకూడదు. ఇది నీచ సంస్కృతి` అంటూ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఓవైసీ చెప్పుకొచ్చారు.