Begin typing your search above and press return to search.

ఓవైసీలు భ‌లే క‌న్ఫ్యూజ్‌ లో ప‌డిపోయారుగా

By:  Tupaki Desk   |   30 Jun 2017 6:02 AM GMT
ఓవైసీలు భ‌లే క‌న్ఫ్యూజ్‌ లో ప‌డిపోయారుగా
X
ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం)...సంద‌ర్భం ఏదైనా దూకుడుగా వెళ్ల‌డం ఎంఐఎం నేత‌లైన ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ - ఆయ‌న సోద‌రుడు - ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ స్టైల్‌. అలా దూకుడుగా వెళ్లే ఓవైసీ బ్ర‌ద‌ర్స్ ముందుకు ఇప్పుడు పెద్ద చిక్కే వ‌చ్చి ప‌డింద‌ని అంటున్నారు. అదే వచ్చేనెల జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ ఓటు ఎవరికి వేయాలనే విష‌యం గురించి. రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌ లో పాల్గొంటామని మ‌జ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు - ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే యూపీఏ నిలబెట్టిన అభ్యర్థి మీరాకుమార్‌ కు మజ్లిస్ ఓట్లు పడతాయా? లేక ఎన్డీఏ కూటమి బరిలో దించిన రాంనాథ్ కోవింద్‌ కు ఓట్లు వేస్తారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మ‌జ్లిస్ ఖాతాలోని మొత్తం పదిమంది సభ్యుల ఓట్లు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి పడుతాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

తెలంగాణ శాసన సభలో మజ్లిస్ పార్టీకి ఏడుగురు సభ్యులు ఉన్నారు. అలాగే మహరాష్ట్ర శాసనసభలో ఆ పార్టీకి ఇద్దరు సభ్యులు ఉన్నారు. పార్లమెంట్‌ లో ఒకే ఒక ఎంపీ ఉన్నారు. మొత్తంగా చూస్తే రాష్ట్రపతి ఎలక్టోరల్ జాబితాలో మజ్లిస్‌ కు 10 ఓట్లు ఉన్నాయి. 2014కు ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి మద్దతు ఇచ్చిన మజ్లిస్ - ఆ తరువాత ఆ పార్టీతో పూర్తిగా తెగతెంపులు చేసుకుని కాంగ్రెస్‌ పై విమర్శలు చేస్తోంది. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నిలబెట్టిన రాంనాథ్ కోవింద్‌ కు మజ్లిస్ మద్ధతు ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2010లో రాంనాథ్ కోవింద్ దేశంలోని ముస్లింలు - క్రైస్తవుల పట్ల చేసిన వ్యాఖ్యలపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిప్పులు చెరుగుతున్నారు. అలాంటి వ్యక్తికి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తే ముస్లింవర్గాల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందినే ఆందోళన మజ్లిస్ వర్గాలను వెంటాడుతోంది.

అయితే, లౌకిక భావాలు కలిగిన పార్టీలతో కలిసి ముందుకు నడువడానికి సిద్ధంగా ఉన్న మజ్లిస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీని ఏ మాత్రం సహించేది లేదంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓట్లు ఎవరికి వేయాలనే విషయంలో పోలింగ్ వరకు వేచి చూడాలని మజ్లిస్ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. కాగా మజ్లిస్ ఓట్లు తమ అభ్యర్థికే పడుతాయని యూపీఏ, ప్రతిపక్షాల కూటమి ఆశలు పెట్టుకుంది. బీజేపీకి మ‌జ్లిస్ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఓటు వేసే ప‌రిస్థితి లేనందున ఎంఐఎం ప్ర‌జాప్ర‌తినిదుల ఓట్లు త‌మ అభ్య‌ర్థికే ప‌డుతాయ‌ని విశ్లేషిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/