Begin typing your search above and press return to search.

17దేశాలు వేరు మ‌నం వేరు అంటున్న ఓవైసీ

By:  Tupaki Desk   |   22 Aug 2017 12:34 PM GMT
17దేశాలు వేరు మ‌నం వేరు అంటున్న ఓవైసీ
X
దేశ సర్వోన్నత న్యాయస్థానం దేశంలో త్రిపుల్ తలాక్ ను ఆరు నెలల పాటు రద్దు చేస్తూ ఈ రోజు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో నెల‌ల విచార‌ణ త‌ర్వాత దీనిపై ఇవాళ త‌మ తీర్పు వెల్ల‌డించింది. చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియా జేఎస్ ఖేహార్ నేతృత్వంలోని ఐదు మ‌తాల‌కు చెందిన ఐదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం 3-2 మెజార్టీతో త‌లాక్ రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని తీర్పునివ్వ‌డ‌మే కాకుండా.. ఆరు నెల‌ల్లో కొత్త చ‌ట్టం చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. త్రిపుల్ తలాక్ పై ఆరు నెలలలోగా చట్టం తీసుకురావాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆరు నెలలలోగా కేంద్రం చట్టం చేయకపోతే ఈ నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే దీనిపై హైద‌రాబాద్ ఎంపీ - ఏఐఎంఐఎం అధినేత ఓవైసీ విభిన్న రీతిలో స్పందించారు

ట‌్రిపుల్ త‌లాక్‌ రాజ్యాంగ విరుద్ధ‌మంటూ సుప్రీంకోర్టు చారిత్ర‌క తీర్పును తాము గౌర‌విస్తామ‌ని అస‌దుద్దీన్ ఒవైసీ స్ప‌ష్టంచేశారు. అయితే క్షేత్ర‌స్థాయిలో తీర్పు అమ‌లు చేయ‌డం మాత్రం స‌వాలే అని అస‌ద్ అన్నారు. ఆచ‌ర‌ణ ప‌రంగా ఇందులో ఉన్న సాద‌క‌బాధ‌కాలు త్వ‌ర‌లో తెలుస్తాయ‌ని చెప్పారు. కాగా, త్రిపుల్‌ తలాఖ్‌ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. ఇది ఎవరి గెలుపు గురించో - ఓటమి గురించో కాదని ఆయన చెప్పారు. పార్టీ తరఫున ఈ తీర్పును తాను స్వాగతిస్తున్నానని ఆయన అన్నారు.

కాగా, ఇప్పటి వరకూ 16 దేశాలు త్రిపుల్ తలాక్ ను నిషేధించాయి. వాటి సరసన 17వ దేశంగా భారత్ నిలిచింది. పాకిస్థాన్ - బంగ్లాదేశ్ - శ్రీలంక - టర్కీ - సైప్రస్ - సిరియా - జోర్డాన్ - ఈజిప్టు - తునిసియా - అల్జీరియా - ఇరాన్ - ఇరాక్ - మలేసియా - బ్రుని - యూఏఈ - ఇండోనేసియాలు త్రిపుల్ తలాక్ ను నిషేధించిన దేశాల జాబితాలో ఉన్నాయి.