Begin typing your search above and press return to search.
యాకూబ్ ఉరి మీద అసద్ ఫైరింగ్ వెనుక?
By: Tupaki Desk | 30 July 2015 3:57 PM GMTముంబయి బాంబుపేలుళ్లలో భాగస్వామ్యం.. 257 మంది అమాయకుల మరణానికి కారణమైన యాకూబ్ మెమన్ ఉరిశిక్ష అమలు చేయటంపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
యాకూబ్ ఉరిని మతం కోణంలో తెరపైకి తెచ్చిన అసద్.. దాన్ని మరింత ప్రచారం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. మత రాజకీయాలతో లబ్థి పొందుతూ.. మహారాష్ట్రలో పాగా వేసిన ఆయన.. తాజాగా.. యాకూబ్ ఉదంతంతో దేశంలోని ముస్లింలకు ఆరాధనీయ నాయకుడిగా మారాలన్న లక్ష్యం కనిపిస్తోంది. తాజాగా ఆయన తెరపైకి తీసుకొచ్చిన వాదనే నిదర్శనం.
యాకూబ్ ఉరిశిక్షతో వీలైనంత రాజకీయ లబ్థిని పొందటంతో పాటు.. ముస్లిం వర్గాలలో తానో కీలకమైన నేతగా మారాలన్న ఆశ కనిపిస్తోంది. యాకూబ్ మెమన్ ఉరిశిక్షకు.. వివాదాస్పద కట్టటం కూల్చివేత.. గోద్రా అల్లర్లు తదితర అంశాలను ముడిపెడుతూ.. ఆయా కేసుల్లోని వారిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.
23 ఏళ్ల పాటు విచారణ జరిగి.. కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ ఉరిశిక్ష వేసుకుంటూ పోయి.. ఉరితీయటానికి కొన్ని గంటల ముందు కూడా వరుస పిటీషన్లతో ఏదోలా ఉరిని ఆపాలని ప్రయత్నించిన దానికి.. ఆయా కేసుల్లో జైలుశిక్ష పడి.. వాటిని అనుభవిస్తున్న వారిని ఒకే గాటిన కట్టటం ఎంతవరకు సబబు?
యాకూబ్ ఉరికి.. మిగిలిన అంశాలకు సంబంధం లేకున్నా.. వాటిని తెరపైకి తీసుకొచ్చి.. మతాన్ని వీలైనంత ఎక్కువగా ప్రస్తావిస్తున్న అసద్ మత రాజకీయాల్ని తొలిదశలోనే తుంచివేయాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో.. భారత ప్రజాస్వామ్యానికి ఇబ్బందికరంగా మారటం ఖాయం. ప్రజాస్వామ్యవాదులు.. లౌకికవాదులు.. అసద్ లాంటి మత రాజకీయనేతల విషయంలో్ మరింత అలెర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.