Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ను మ‌ళ్లీ ఆకాశానికి ఎత్తేసిన ఓవైసీ

By:  Tupaki Desk   |   23 Oct 2017 12:46 PM GMT
కేసీఆర్‌ ను మ‌ళ్లీ ఆకాశానికి ఎత్తేసిన ఓవైసీ
X
తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ను మ‌రోమారు ఏఐఎంఐఎం అధినేత‌ - హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ ఆకాశానికి ఎత్తేశారు. ఇటీవలి సంద‌ర్భం క‌లివ‌స్తున్న‌ప్పుడ‌ల్లా సీఎం కేసీఆర్‌ ను పొగిడేస్తున్న ఓవైసీ తాజాగా ఓ ప‌త్రిక‌లో వ‌చ్చిన ఇంట‌ర్వ్యూ ఆధారంగా ప్ర‌శంసించ‌డం గ‌మ‌నార్హం. మంత్రి కేటీఆర్ ఓ ఆంగ్ల ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఈ కితాబు ఇవ్వ‌డం కొస‌మెరుపు.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే..2019 ఎన్నిక‌ల్లో ఢిల్లీలో ఒకే పార్టీ స‌ర్కారును ఏర్పాటు చేయ‌ద‌ని...సంకీర్ణ స‌ర్కారే వ‌స్తుంద‌ని మంత్రి కేటీఆర్‌ ఓ ఇంట‌ర్వ్యూలో విశ్లేషించారు. ఈ అంశాన్ని స‌ద‌రు ప‌త్రిక ట్వీట్ చేయ‌గా...దానికి ఓవైసీ రీ ట్వీట్ చేస్తూ...`అల్లా ద‌య‌తో 2019లో సంకీర్ణ స‌ర్కారు క‌నుక ఏర్ప‌డితే...అందులో తెలంగాణ సీఎం కేసీఆర్ కీల‌క పాత్ర పోషిస్తారు. కీల‌క రాష్ట్ర ర‌థ‌సార‌థిగా కేసీఆర్ పోషించే పాత్ర ప్ర‌ముఖంగా ఉంటుంది`` అంటూ ట్వీట్ చేసి త‌న అభిమానాన్ని చాటుకున్నారు.

మ‌రోవైపు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కానికి కూడా కితాబు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఓ విప్లవానికి నాంది పలకబోతున్నాయని ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. హైద‌రాబాద్‌ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఎంతో సామాజిక మార్పున‌కు దోహదపడుతున్నాయన్నారు. రాబోయే పదేళ్లలో ఓ విప్లవం చూస్తామని ఓవైసీ విశ్లేషించారు. చాలా మంది ముస్లింలు తమ పిల్లలను రెసిడెన్షియల్‌ స్కూళ్లలో చేర్పించడానికి ఆసక్తి చూపుతున్నారని, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో బోధన - వసతి - ఆహారం బాగున్నాయంటూ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ తెలంగాణ ప్రభుత్వంపై ప్రసంశల వర్షం కురిపించారు.