Begin typing your search above and press return to search.

శ‌భాష్ అనేలా అస‌ద్ తాజా వ్యాఖ్య‌లు!

By:  Tupaki Desk   |   4 April 2017 7:02 AM GMT
శ‌భాష్ అనేలా అస‌ద్ తాజా వ్యాఖ్య‌లు!
X
హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ నోటి నుంచి వ‌చ్చే ఏమాట‌కైనా అంద‌రి ఆమోదం అస్స‌లు ఉండ‌దు. ఆయ‌న చేసే వ్యాఖ్య‌ల్లో ఎక్కువ భాగంగా వివాదాస్ప‌ద‌మైన‌వే ఉంటాయ‌ని చెప్పాలి. కొన్ని వ‌ర్గాల వారికి మాత్ర‌మే ఆమోద‌యోగ్యంగా ఉండేలా ఆయ‌న రియాక్ట్ అవుతుంటారు. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు అందుకు భిన్నంగా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఫార్మ‌సీ విద్యార్థిని అయేషా మీరా హ‌త్య కేసుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అస‌ద్ స్పందించారు. ఈ కేసులో నిందితుడైన స‌త్యంబాబును.. హైకోర్టు నిర్దోషిగా తీర్పు చెప్పి విడుద‌ల చేయ‌టంపై స్పందించిన ఆయ‌న‌.. ఈ కేసును విచారించిన పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

ఈ కేసును ద‌ర్యాప్తు చేసిన పోలీసు అధికారుల్ని బాధ్యులుగా చేస్తూ.. వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునేలా కేంద్రం ప్ర‌త్యేక యంత్రంగాన్ని ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇలాంటి చ‌ర్య‌లు తీసుకుంటే త‌ప్పించి.. భ‌విష్య‌త్తులో ఇలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌కుండా పోలీసు అధికారులు జాగ్ర‌త్త‌లు తీసుకుంటార‌న్నారు. అమాయ‌క యువ‌కుల్ని కేసుల్లో ఇరికించి జైలుపాలు చేసే పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఎలాంటి త‌ప్పులు చేయ‌కున్నా.. అన్యాయంగా ఏళ్ల త‌ర‌బ‌డి జైల్లో మ‌గ్గిన ఒక నిర‌ప‌రాధికి జ‌రిగిన అన్యాయం గురించి రాజ‌కీయ నేత‌లు ఎవ‌రూ మాట్లాడ‌క‌పోవ‌టంపై అస‌ద్ అసంతృప్తి వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం.

త‌ప్పుడు కేసుల్లో ఇరికించి.. అమాయ‌కుల్ని జైలుపాలు చేసే పోలీసు అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకున్న‌ప్పుడు.. విచార‌ణ స‌రిగ్గా జ‌రిగే వీలు ఉంటుంద‌న్న అస‌ద్ మాట‌ల్ని మొత్తంగా కాకున్నా.. ఆ ఆలోచ‌న‌ను అయితే అంద‌రూ ఓకే అనేయ‌ట‌మే ఖాయం. ఒక సామాజిక అంశంపై హైద‌రాబాద్ ఎంపీ రియాక్ట్ అయిన తీరు ఇప్పుడు అంద‌రి ప్ర‌శంస‌లు పొందుతుంద‌న‌టంలో సందేహం లేదని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/