Begin typing your search above and press return to search.

హిజాబ్ తీర్పుపై అసదుద్దీన్ ఓవైసీ స్పందన ఇదీ

By:  Tupaki Desk   |   16 March 2022 3:27 AM GMT
హిజాబ్ తీర్పుపై అసదుద్దీన్ ఓవైసీ స్పందన ఇదీ
X
హిజాబ్ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టేసి మరీ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కర్ణాటక హైకోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా చాలా మంది స్పందిస్తున్నారు. ఈ తరుణంలో ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కోర్టు తీర్పుపై స్పందించారు. తీర్పుపై నిరసన వ్యక్తం చేస్తూ 15 పాయింట్లతో ట్విట్టర్ లో ఒక సుదీర్గమైన సందేశం ఉంచారు.

ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేదిగా తీర్పు ఉందని ఓవైసీ అన్నారు. మతపరమైన స్వేచ్ఛ, సంస్కృతి, భావ ప్రకటన, రాజ్యాంగం అందించిన ఆర్టికల్ 15 లాంటి వాటిని ఉల్లంఘించినట్లే అవుతుంది. ముస్లిం మమిళల మీద ఈ తీర్పు ప్రతికూల ప్రభావం చూపెడుతుంది. వాళ్లు లక్ష్యంగా మారుతారు. ఆధునికత అంటే మతపరమైన ఆచారాలను విడిచిపెట్టడం కాదు.. హిజాబ్ వేసుకుంటే ఏంటి సమస్య అని ఓవైసీ నిలదీశారు.

తీర్పు వెలువడిన వెంటనే ఆయన ట్విట్టర్ లో వరుస ట్వీట్లు చేశారు. హిజాబ్ పై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుతో నేను ఏకీభవించను అని ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తీర్పుతో విభేదించడం నా హక్కు. పిటీషనర్లు సుప్రీంకోర్టు ముందు అప్పీల్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మతం, సంస్కృతి, స్వేచ్ఛపై ప్రాథమిక హక్కులను నిలిపివేసినందున.. ఇతర మత సమూహాల సంస్థలు కూడా ఈ తీర్పును అప్పీలు చేయాలని ఆశిస్తున్నానంటూ వరుస పోస్టులు చేశారు.

కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేసిన హిజాబ్ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. హిజాబ్ ధరించడం మతపరంగా తప్పనిసరి కాదని పేర్కొన్నారు. విద్యాసంస్థల్లో సంప్రదాయ వస్త్రధారణపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కోర్టు సమర్థించింది. ఈ మేరకు ఈ అంశంపై దాఖలైన పిటీషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. విద్యాసంస్థల ప్రొటోకాల్ ను విద్యార్థులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.