Begin typing your search above and press return to search.

అయోధ్య‌పై పీట ముడి వేస్తూ అస‌ద్ ట్వీట్

By:  Tupaki Desk   |   15 Aug 2017 4:32 AM GMT
అయోధ్య‌పై పీట ముడి వేస్తూ అస‌ద్ ట్వీట్
X
ద‌శాబ్దాలుగా నానుతున్న అయోధ్య‌లోని వివాదాస్ప‌ద స్థ‌లంపై యూపీ షియా వ‌క్ఫ్ బోర్డు దాఖ‌లు చేసిన సంచ‌ల‌న అంశాల‌పై తాజాగా హైద‌రాబాద్ ఎంపీ.. మ‌జ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందిచారు. అయోధ్య‌లోని వివాదాస్ప‌ద భూమిపై యాజ‌మాన్య హ‌క్కులు తామేవ‌ని.. వేరే వారికి లేవ‌ని వాదిస్తున్న ఉత్త‌ర ప్ర‌దేశ్ షియా వ‌క్ఫ్ బోర్డు.. వివాదాస్ప‌ద స్థ‌లంలో రామాల‌యాన్ని నిర్మించుకోవ‌టం.. దానికి దూరంగా. .ముస్లింలు మెజార్టీ ఉన్న ప్రాంతంలో మ‌సీదును నిర్మించుకునే ప్ర‌తిపాద‌న‌ను తెర మీద‌కుతీసుకురావ‌టం తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా వివాదంలో ఉన్న భూమి మొత్తానికి తాము య‌జ‌మానుల‌మ‌ని.. మ‌రెవ‌రికీ ఎలాంటి హ‌క్కులు లేవంటూ షియా వ‌క్ఫ్ బోర్డు తేల్చి చెప్పింది. ఈ ఉదంతంపై తాజాగా ఎంపీ అస‌ద్ రియాక్ట్ అవుతూ.. మ‌సీదుల‌ను ఎవ‌రో ఒక‌రు మ‌రొక‌రికి ధారాద‌త్తం చేయ‌టం ఎప్ప‌టికి సాధ్యం కాద‌న్నారు. మ‌త పెద్ద చెప్పినంత మాత్రాన మ‌సీదును వ‌దులుకోవ‌టం కుద‌ర‌ద‌న్నారు.

వివాదాస్ప‌ద స్థ‌లాన్ని హిందువుల‌కు అప్ప‌గించి.. దానికి స‌ముచిత దూరంలో ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతంలో మ‌సీదును నిర్మించుకోవాల‌న్న మాట‌ను ఆయ‌న పూర్తిగా వ్య‌తిరేకించారు. మ‌త నాయ‌కుడు మౌలానా చెప్పినంత మాత్రాన మ‌సీదుల‌ను వ‌దులుకోవాల్సిన అవ‌స‌రం లేదంటూ ఆయ‌న ట్వీట్ చేశారు.

మ‌సీదుల నిర్వ‌హ‌ణ‌లో పాలు పంచుకున్నంత మాత్రానా మౌలాలు.. షియాలు.. సున్నీలు... బ‌రెల్వీ.. సూఫీ.. దేవ‌బంది.. స‌లాఫీ.. బోహ్రాలు మ‌సీదుల‌కు య‌జ‌మానులు కాద‌ని.. అల్లా మాత్ర‌మే య‌జ‌మాని అని అస‌ద్ త‌న ట్వీట్ సందేశంలో పేర్కొన్నారు.

అల్లా మీద ఉన్న విశ్వాసంతోనే ముస్లింలు మ‌సీదులు నిర్మించుకొని అందులో ప్రార్థ‌న‌లు జ‌రుపుతార‌న్నారు. అంతాబాగానే ఉంది కాని.. మ‌త ప్ర‌చార‌కులు.. పెద్ద మ‌నుషులు.. మ‌త పెద్ద‌ల మాట‌లు లైట్ అంటున్న అస‌ద్.. ఆయ‌న ఆయ‌న లాంటి మ‌త రాజ‌కీయ నేత మాట‌ను సైతం ఎందుకు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని ప్ర‌శ్నిస్తే ఆయ‌న స‌మాధానం ఏం చెబుతారో?