Begin typing your search above and press return to search.
బీజేపీకి 'బీ' టీమ్ ఆ పార్టీనా?
By: Tupaki Desk | 29 Jan 2020 6:33 AM GMTరాజకీయాల్లో ‘బీ’ టీమ్ చాలా పవర్ ఫుల్ పాపులర్ మాట.. అంటే ఏంటో తెలియని వారికి ఓ చిన్న ఉదాహరణ.. ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి తెరవెనుక సపోర్టుగా నిలుస్తూ రాజకీయం చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాన్ ను టీడీపీకి ‘బీ’టీమ్ గా వైసీపీ శ్రేణులు ఆరోపిస్తుంటాయి.. ఇక దేశంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఈ ‘బీ’ టీంలు ఉన్నాయండోయ్..
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్రంలోని బీజేపీకి అధికార టీఆర్ ఎస్ ‘బీ’టీం అన్న ఆరోపణలను తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో మహారాష్ట్రలో బీజేపీని గెలిపించడానికి ఎంఐఎం విడిగా పోటీచేసిందని.. బీజేపీకి ఎంఐఎం ‘బీ’టీం అని ఇదే కాంగ్రెస్ జాతీయ పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు.
ఇలా బీజేపీ అంటే పడని కాంగ్రెస్ దిగ్గజ నేతలంతా పలుమార్లు బీజేపీకి బీ టీంలుగా టీఆర్ ఎస్ - ఎంఐఎం అంటూ ఆడిపోసుకున్నారు.
అయితే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అసలు బీజేపీకి ‘బీ’ టీం ఎవరన్నది తేటతెల్లమైందని హైదరాబాద్ ఎంపీ - ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన విషయాలు బయటపెట్టారు. తాజాగా ట్విట్టర్ లో ఆయన షేర్ చేసిన పోస్టు వైరల్ గా మారింది.
బీజేపీకి అసలైన ‘బీ’టీం కాంగ్రెస్ పార్టీ అని అసదుద్దీన్ చేసిన పోస్టు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. నిజామాబాద్ కార్పొరేషన్ లో అత్యధిక సీట్లు సాధించిన బీజేపీకి కార్పొరేషన్ దక్కకుండా తాము 16 సీట్లు సాధించినా.. సర్దుకొని 13 సీట్లు సాధించిన టీఆర్ ఎస్ కు మద్దతు ఇచ్చి బీజేపీని ఓడించామని అసదుద్దీన్ తెలిపారు. నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీ పరం కాకుండా తాము పంతం పట్టామని అన్నారు.
ఇక ఇదే కాంగ్రెస్ పార్టీ - మణికొండ సహా చాలా మున్సిపాలిటీల్లో టీఆర్ ఎస్ ను ఓడించడానికి అపవిత్రంగా బీజేపీతో పొత్తు పెట్టుకొని మున్సిపాలిటీలను కైవసం చేసుకుందని అసుదుద్దీన్ ట్విట్టర్ సాక్షిగా కడిగేశారు..
దీన్ని బట్టి బీజేపీకి ‘బీ’టీం ఎవరో తేలిపోయిందని అసదుద్దీన్ ఎండగట్టారు. మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశంలో అన్నట్టు జాతీయ పార్టీలు కాంగ్రెస్ - బీజేపీలు ఒకరికొకరు బీటీంలుగా పనిచేస్తూ ప్రాంతీయ పార్టీలను ఓడించడానికి కుట్ర పన్నుతున్నాయని అసద్ విమర్శించారు. ఇలా ‘బీ’టీం అనే పదానికి కొత్త అర్థాన్ని అసదుద్దీన్ చెప్పి అందరికీ షాకిచ్చారు.