Begin typing your search above and press return to search.

బుల్డోజర్ల ఎఫెక్ట్: యోగిపై అసదుద్దీన్ ఓవైసీ షాకింగ్ కామెంట్స్

By:  Tupaki Desk   |   13 Jun 2022 5:30 PM GMT
బుల్డోజర్ల ఎఫెక్ట్: యోగిపై అసదుద్దీన్ ఓవైసీ షాకింగ్ కామెంట్స్
X
అక్రమార్కుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయిస్తూ దేశంలో సంచలనం సృష్టిస్తున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇప్పుడు ఈ పరిణామం దేశంలో చర్చనీయాంశమైంది. మొన్నటివరకూ ఢిల్లీలో బుల్డోజర్లకు పనిచెప్పారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి.

ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీ సీఎం యోగి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎవరినైనా దోషులుగా నిర్ధారిస్తారా? వారి ఇళ్లను కూల్చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుజరాత్ లోని కచ్ నగరంలో ఓ ర్యాలీలో మజ్లిస్ అధినేత ఓవైసీ మాట్లాడారు. న్యాయ అన్యాయాలను డిసైడ్ చేయడానికి కోర్టులున్నాయని.. కానీ ప్రభుత్వమే ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని కూల్చివేయడం ఏంటని విమర్శించారు. యూపీలో యోగి సర్కార్ చేస్తున్నది కరెక్ట్ కాదని విమర్శించారు.

యూపీలోని ప్రయాగ్ రాజ్ లో హింసాత్మక ఘటనలకు ప్రధాన సూత్రధారి అయిన జావేద్ మహ్మద్ ఇంటిని యోగి సర్కార్ కూల్చివేసింది. ఈ నేపథ్యంలోనే గుజరాత్ లోని కచ్ నగరంలో ఓవైసీ భగ్గుమన్నారు.

మాజీ బీజేపీ నేత నుపూర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనగా జూన్ 10వ తేదీన ముస్లిం సంఘాలు దేశవ్యాప్తంగా మసీదుల వద్ద ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యూపీతో సహా పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నారు. పోలీసులు నిరసనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

ఘర్షణకు పాల్పడి సంఘ విద్రోహ చర్యలకు పాల్పుడుతున్న వారిపై యూపీ సీఎం యోగి ఉక్కుపాదం మోపుతున్నారు. వారి ఇంటిని బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు. అదే ఇప్పుడు అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఓవైసీ ఆగ్రహానికి కారణమైంది.