Begin typing your search above and press return to search.

మోడీ.. రాహుల్‌ కు భారీ ట్వీట్ పంచ్ వేసిన ఓవైసీ

By:  Tupaki Desk   |   30 Nov 2017 8:33 AM GMT
మోడీ.. రాహుల్‌ కు భారీ ట్వీట్ పంచ్ వేసిన ఓవైసీ
X
నిద్ర లేచింది మొద‌లు అస‌దుద్దీన్ ఓవైసీని తిట్టేవారు చాలామంది క‌నిపిస్తారు. మ‌తాన్ని అడ్డు పెట్టుకొని రాజ‌కీయం చేయ‌టం ఏమిటి ఛండాలంగా అంటూ విమ‌ర్శిస్తుంటారు. నిజానికి ఓవైసీని అన‌టానికి ఏమీ లేదు. ఎందుకంటే తాను చేసే ప‌నిని ఓపెన్ గానే చెప్పేశాడు.. త‌ప్పించి ముద్దుముద్దుగా దొంగ మాట‌లు చెప్ప‌లేదు. ఆ మాట‌కు వ‌స్తే ఓవైసీని మెచ్చుకోవాలి. ఎందుకంటే.. తాను చెప్పే మాట‌ల్లో నిజాయితీ ఉంటుందే త‌ప్పించి మోసం ఉండ‌దు
.
మ‌తాన్ని ఆధారంగా చేసుకొని రాజ‌కీయం చేయ‌టాన్ని ఓపెన్ గానే చెప్పేస్తాడు కానీ.. ప్ర‌ధాని మోడీ.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ లాంటి వాళ్లు ఎప్పుడూ తాము మ‌త రాజ‌కీయాల్ని చేస్తామ‌ని చెప్పరు. కానీ.. వారు చేసే వాటిలో ఈ మ‌తం కోణం కీల‌కంగా క‌నిపిస్తుంది. ఎక్క‌డి దాకానో ఎందుకు.. తాజాగా జ‌రుగుతున్న గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో కీల‌క‌మైన హిందువుల ఓట్ల‌ను కొల్ల‌గొట్టేందుకు వీలుగా ఎప్పుడూ లేనిది రాహుల్ సైతం తాను బ్రాహ్మిణ్ అనే మాట‌ను చెప్పుకోవ‌టానికి తెగ ఆరాట‌ప‌డుతున్నారు.

ఎప్పుడు లేనిది తాను శివ‌భ‌క్తుడ్ని అంటూ ఎందుకు చెప్పుకోవాల్సి వ‌చ్చింది. హిందూయేత‌ర వ్య‌క్తులు పెట్టే పుస్త‌కంలో రాహుల్ పేరిట సంత‌కం చేశారంటూ సోష‌ల్ మీడియాలో సాగిన వైర‌ల్ పై కాంగ్రెస్ నేత‌లు స్పందిస్తూ.. రాహుల్ జంధ్యం వేసుకునే బ్రాహ్మ‌ణుడిగా అభివ‌ర్ణించారు. మ‌తం ఆధారంగా రాజ‌కీయాలు చేస్తార‌న‌టానికి ఇంత‌కు మించిన సాక్ష్యం ఏం ఉంటుంది. ఈ విష‌యాన్ని ఇలా వ‌దిలేస్తే.. మోడీ విష‌యం తెలిసిందే.. ఆయ‌న‌నోటి నుంచి మ‌తం ఆధారంగా వ‌చ్చే మాట‌ల్ని త్వ‌ర‌గా మ‌ర్చిపోలేం.

ఓప‌క్క మ‌తం గురించి మాట్లాడుతూనే.. తాము జాతీయ‌వాదుల‌మ‌ని.. లౌకికవాదాన్ని న‌మ్మే వాళ్ల‌మ‌ని చెప్పుకోవ‌టం క‌నిపిస్తుంది. ఒక‌వేళ అదే నిజ‌మైతే.. త‌మ హిందూ ఐడెంటిటీని అదే ప‌నిగా ప్ర‌స్తావించాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. కానీ.. అందుకు భిన్నంగా తాము హిందువుల‌మ‌న్న మాట‌ను చెప్పేందుకు ప‌డే త‌ప‌న అంతా ఇంతా కాదు. ఇదే విష‌యాన్ని సూటిగా ట్వీట్ సంధించి క‌డిగేశాడు మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ.

కాంగ్రెష్ త‌మ ఉపాధ్య‌క్షుడు హిందువు.. జంధ్యం వేసుకునే బ్రాహ్మ‌ణుడ‌ని చెబుతుంద‌ని.. బీజేపీ త‌మ నేత మోడీని హిందువు.. ఓబీసీగా అభివ‌ర్ణిస్తుంద‌ని వ్యాఖ్యానించారు. తాను మాత్ర‌మే మ‌త‌త‌త్వ్త‌వాదిగా.. మిగిలిన వారంతా లౌకిక‌.. జాతీయ‌వాదులుగా చెప్పుకోవ‌టాన్ని అంగీక‌రించ‌న‌న్నారు. నిష్ఠూరంగాఉన్నా ఈసారికి మాత్రం పెద్ద ఓవైసీ నిజాన్నే మాట్లాడార‌ని చెప్పాలి.