Begin typing your search above and press return to search.

పాతబస్తీ నేరస్థులకు అసదుద్దీన్ ఓవైసీ స్ట్రాంగ్ వార్నింగ్ .. ఏమన్నారంటే

By:  Tupaki Desk   |   7 Oct 2021 3:30 PM GMT
పాతబస్తీ నేరస్థులకు అసదుద్దీన్ ఓవైసీ స్ట్రాంగ్ వార్నింగ్ .. ఏమన్నారంటే
X
హైదరాబాద్‌ లోని పాతబస్తీ నేరస్థులకు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాతబస్తీ ప్రజలను ఎవరైనా వేధిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తానంటూ కీలక హెచ్చరికలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా జరిగే పలు అసాంఘీక కార్యకలపాల మూలలు నగరంలోని పాతబస్తిలో మూలాలు ఉంటాయి అనే ఓ అపవాద ఉంది. అయితే ఇలా గ్యాంగ్‌ లు , రౌడియిజం పెద్ద ఎత్తున కొనసాగుతుంటాయి. దీనితో వాళ్లు బయటి వ్యక్తులనే టార్గెట్ చేయకుండా పాతబస్తిలోని వారిని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనితో ఇటివల హత్యలు, ఎక్కువగా జరుగుతున్నాయి. రెండు గ్యాంగుల మధ్య ఎక్కువ అవుతుండడంతో ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ సీరియస్ అయ్యారు.

నగరంలోని యువకులు గ్యాంగ్‌లను మెయింటెన్ చేస్తూ రౌడీయిజానికి దిగితే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.. తప్పుడు దారిలో ప్రయాణిస్తున్న వారిని మత పెద్దలు, ప్రజలు సామాజిక బహిష్కరణ చేయాలని ఆయన సూచించారు. హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. పాతబస్తీలో రోజు రోజుకీ పెరుగుతున్న హత్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాతబస్తీ మత పెద్దలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పాతబస్తీలో ప్రతి చిన్న విషయానికి ఇరువర్గాలు కొట్టుకుంటూ హత్యలు చేసుకుంటున్నారని, ఈ మధ్య కాలంలో హత్యలు విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్లో మార్పు కోసం తల్లిదండ్రులు, మతపెద్దలు ముందుకు రావాలని అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు.

పాతబస్తీలో యువకులు గ్యాంగ్‌లు మెయింటెన్ చేసి అమాయకులని వేధించి, హత్యకు పాల్పడితే అలాంటి వ్యక్తులను ఎట్టిపరిస్థితుల్లో వదలను అంటూ మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. ప్రజలని వేధించే వ్యక్తులను గుర్తించి వాళ్ళ మార్పు కోసం ప్రయత్నించాలని, లేకుంటే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు ఆయన సూచించారు. అయినా వారిలో మార్పు రాకపోతే.. సామాజిక బహిష్కరణ చేయాలని మత పెద్దలకు అసదుద్దీన్ విజ్ఞప్తి చేశారు. ప్రజల్ని వేధించే ఎంతటి వాడైనా సరే తాను వదిలిపెట్టను అంటూ ఓవైసీ చాలా సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. అలాంటి వ్యక్తుల ఓట్లు కూడా తమ పార్టీకి అవసరం లేదని అన్నారు.