Begin typing your search above and press return to search.
అగ్రకులాలపై దండెత్తిన ఒవైసీ
By: Tupaki Desk | 21 Jan 2016 8:10 AM GMTమతం గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడేసే నేతల్లో మజ్లిస్ అధినేత అసుదుద్దీన్ ఓవైసీ ఒకరు. మతం గురించి ఆయన తన మాటల్లో అనునిత్యం ఉపయోగిస్తుంటారు. అలాంటి ఆయన తాజాగా కులం గురించీ మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో.. ఆ వివాదంపై పలువురు రాజకీయ నేతలు వర్సిటీకి వెళ్లటం.. అక్కడ ఆందోళన చేస్తున్న విద్యార్థులకు తమ మద్దతు తెలిపి రావటం తెలిసిందే.
అలా వెళుతున్న నేతల్లో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా చేరారు. హిందువులపై తనకున్న వ్యతిరేకతను పెద్దగా దాచుకోకుండా.. అవకాశం వచ్చిన ప్రతిసారీ హిందుత్వ అంటూ విమర్శలు చేసే అసదుద్దీన్.. తాజాగా రోహిత్ ఇష్యూలో కులాన్ని సీన్లోకి తీసుకురావటం గమనార్హం.
హెచ్ సీయూకి వెళ్లిన అసద్.. రోహిత్ మరణానికి కారణం చెప్పే ప్రయత్నంలో.. బ్రాహ్మణ అగ్రకుల అహంకారమే ఎంతో భవిష్యత్తు ఉన్న మేధావి ఆత్మహత్యకు కారణంగా వ్యాఖ్యానించటం గమనార్హం. కేంద్రంలో ఉన్న బీజేపీ భారతదేశంలో కేవలం హిందువులు మాత్రమే ఉండాలని.. ఇతరులు ఉండకూడదని భావిస్తోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
భారతదేశంలో హిందువులు కాని వారు నివసించకూడదనే నిబంధన లేదన్న విషయాన్ని ప్రస్తావించిన అసద్.. భారత్ అందరిదని వ్యాఖ్యానించారు. విద్యాసంస్థల్లో రాజకీయ నాయకులు ప్రమేయం సరికాదని వ్యాఖ్యానించారు. ఇన్ని మాటలు చెప్పిన అసద్.. విశ్వవిద్యాలయంలో అసద్ చేస్తున్నదేమిటి?