Begin typing your search above and press return to search.
ఒక్క భార్యతోనే పరేషాన్..భార్యల లెక్కపై నోరు విప్పిన అసద్
By: Tupaki Desk | 19 Jan 2020 4:40 AM GMTరాజకీయాల్లో దూకుడు ఎలా ఉండాలో చేతల్లో చూపించే పార్టీగా మజ్లిస్ ను చెప్పాలి. ఆ పార్టీ అధినేత అసద్.. ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఘాటు వ్యాఖ్యలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తనకు ఇద్దరు భార్యలంటూ ఇటీవల కాలంలో సాగుతున్న ప్రచారంపై తొలిసారి పెదవి విప్పారు. తనకు ఇద్దరు భార్యలన్నది ఉత్త అబద్ధంగా చెప్పిన ఆయన.. ఒక భార్యతోనే పరేషాన్ గా ఉందని.. ఇద్దరు భార్యల్ని చేసుకొని వేగేదెలా? అంటూ ఛలోక్తులు సంధించారు. తాజాగా జరుగుతున్న పుర ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మజ్లిస్ హైదరాబాద్ కు మాత్రమే పరిమితమైన పార్టీ కానేకాదన్న ఆయన.. రాష్ట్రం మొత్తం విస్తరిస్తోందన్నారు. ప్రస్తుతం మజ్లిస్ గాలి వీస్తోందని.. ఇప్పటివరకూ కామారెడ్డిలో ఎందుకు ఓటమిపాలు అవుతుందెందుకో అర్థం కావట్లేదన్నారు. తన తండ్రి కాలం నుంచే కామారెడ్డిలో తమ పార్టీ ఉందన్నారు. కామారెడ్డి పట్టణం తమకు కొత్త కాదని.. తమ పార్టీకి చెందిన అభ్యర్థులందరూ గెలుస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
మజ్లిస్ పార్టీ తిరంగా ర్యాలీ చేస్తే.. కాంగ్రెస్.. బీజేపీలు పరేషాన్ అయ్యాయని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఒక శవంలా మారిందన్న ఆయన.. దేశంలో పొలిటికల్ మ్యారేజ్ చట్టం వచ్చిందన్నారు. శివసేన.. కాంగ్రెస్ పెళ్లి చేసుకుంటే.. శరద్ పవార్ రిసెప్షన్ చేసుకున్నారన్నారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీనే కాదన్న ఆయన.. బీజేపీకి భయపడి రాహుల్ వడయార్ కు వెళ్లి పోటీ చేశారన్నారు. సొంత నేతను గెలిపించుకోని కాంగ్రెస్ తనపై ఏం పోటీ చేస్తుందన్నారు. దేశంలో బీజేపీ పాలన హిట్లర్ పాలనను తలపిస్తోందన్న ఆయన.. యూపీలోని యోగి సర్కారు ఇప్పటికి పాతిక మంది ముస్లింలను పొట్టనపెట్టుకుందని ఆరోపించారు. మరి.. అసద్ కు ఇద్దరు భార్యలంటూ ప్రచారం చేస్తున్న వారు మజ్లిస్ అధినేత తాజా క్లారిటీకి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.