Begin typing your search above and press return to search.

పద్మావత్ బక్వాస్.. మస్లింలూ చూడకండి

By:  Tupaki Desk   |   19 Jan 2018 7:07 AM GMT
పద్మావత్ బక్వాస్.. మస్లింలూ చూడకండి
X
వివాదాల నడుమ తెరకెక్కిన వివాదాస్పద కథ పద్మావతి ఎట్టకేలకు పద్మావత్ గా రిలీజ్ అవుతోంది. కేంద్రం ప్రవేశపెట్టిన స్పెషల్ కమిటీ ద్వారా చారిత్రాత్మక కథలోని కొన్ని సన్నివేశాలను తొలగించి అలాగే మాటలను కూడా కట్ చేసి జనవరి 26న తెలుగు తమిళ్ అలాగే హిందీలో రిలీజ్ చేయడానికి దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి ప్లాన్ చేస్తున్నాడు. ఇక ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. వివాదాలతో సినిమాకు ఎప్పుడో క్రేజ్ వచ్చింది.

దీంతో వేడుకల ద్వారా కాకుండా సోషల్ మీడియా ద్వారానే చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇకపోతే మొన్నటి వరకు హిందు వర్గాలు ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ముస్లిమ్ మతానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి కూడా పద్మావత్ సినిమాపై ఎవరు ఊహించని విధంగా వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. వరంగల్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్ ఐఎమ్ అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పద్మావత్ బక్ వాస్ (చెత్త) సినిమా అని వ్యాఖ్యానించారు. దేవుడు ఈ చిత్రాలను చూడటానికి మిమ్మల్ని సృష్టించలేదు. దేవుడు మీకు మంచి జీవితాన్ని గడపటానికి మరియు శతాబ్దాలుగా జ్ఞాపకముంచే మంచి పనులు చేయటానికి మిమ్మల్ని సృష్టించాడు అని తెలిపారు.

ఇక ముస్లిమ్ సోదరులు ఎవరు ఈ సినిమా చూడవద్దని చెబుతూ ముఖ్యంగా ముస్లిమ్ యువకులు ఇలాంటి చెత్త సినిమాలను చూసి సమయాన్ని డబ్బును వృధా చేసుకోవద్దని తెలిపారు. అనంతరం ప్రధానమంత్రి మోడీపై కూడా అజాదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. త్రిపుల్ తలాక్ పై చర్చించడానికి ఎటువంటి ప్యానెల్ ఏర్పాటు చేయలేదు కాని.. పద్మావత్ కోసం రివ్యూ కమిటీని ఏర్పాటు చేయడం ముస్లింల పట్ల చిన్నచూపేనని వ్యాఖ్యానించారు.